తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Vijayashanthi: ఎమ్మెల్సీ కవిత పట్ల బీజేపీ నాయకురాలు విజయశాంతి ఇంట్రెస్టీంగ్ కామెంట్స్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరోసారి ఎమ్మెల్సీ కవిత కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కవిత స్పందిస్తూ… మోదీ, కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడింది. తనకు నోటీసులు వచ్చాయని, న్యాయసలహా తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో చర్యలో భాగంగానే తనకు నోటీసులు వచ్చాయని తెలిపారు. కాబట్టి వాటిపై అంతగా స్పందించాల్సిన అవసరంలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ కొత్త ఎపిసోడ్ వచ్చిందన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ఎమ్మెల్సీ కవిత పట్ల విజయశాంతి సానుభూతి ప్రకటించారు. ఒక ఆడబిడ్డకు కష్టం రావొద్దని… ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషిగానే నిలవాలని వ్యక్తిగతంగా తాను కోరుకుంటాన్నట్లు తెలిపారు. అయితే.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత పేర్కొనడాన్ని విజయశాంతి తప్పుబట్టారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం లేదని.. ఆ ఆవశ్యకత కూడా లేదంటూ వివరణ ఇచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయని వాపోయారు. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత అరెస్ట్ కానట్లయితే.. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అనే భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెఎస్ కు ఉందేమో గానీ, జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button