తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: హను-మాన్

Pakka Telugu Rating : 3.5/5
Cast : తేజ సజ్జ, అమృత అయ్యర్ , వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను
Director : ప్రశాంత్ వర్మ
Music Director : గౌరహరి, కృష్ణ సౌరభ్‌లు
Release Date : 12/01/2024

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూవీ హను-మాన్. వీరిద్దరి కలయికలో ఇంతకుముందే జాంబిరెడ్డి మూవీ రాగా ఆ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఇప్పుడు మళ్ళీ హను-మాన్ మూవీతో థియేటర్లలో సందడి చేయడానికి వచ్చారు. ఈ మూవీలో తేజ సజ్జకు జోడిగా అమృత అయ్యర్ నటించింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!

కథ:

మైకేల్(వినయ్ రాయ్) చిన్నపిల్లాడిగా ఉన్నప్పటికి నుంచి సూపర్ హీరో కావాలనుంటుంటాడు. సూపర్ హీరో లాగా బిల్డింగ్ పై నుంచి గాల్లో ఎగరబోయి కాలు విరగ్గొట్టుకుంటాడు. దాంతో తల్లిదండ్రులు మందలించారని వారిని చంపేస్తాడు. పెద్దయ్యాక కూడా తను సూపర్ హీరోలాగా మారడానికి కావలసిన పవర్ ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నాలను చేస్తుంటాడు. తనకు ఎప్పుడు తోడుగా ఉండే ప్రెండ్ ( వెన్నెల కిశోర్) ఒక సూపర్ సూట్ ను తయారుచేస్తాడు మైకేల్ కోసం. మరోవైపు అంజనాద్రి అనే గ్రామంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు హనుమంతు( తేజ సజ్జ). చిన్నప్పటి నుంచి అదే గ్రామంలో ఉండే మీనాక్షి( అమృత అయ్యర్) ని ప్రేమిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ ను బందిపోట్ల నుంచి కాపాడే క్రమంలో హనుమంతును బందిపోట్లు పొడిచి కొండ పై నుంచి నదిలో తొసేస్తారు. హనుమంతుకు ఆ నదిలోనే సూపర్ పవర్స్ లభిస్తాయి. అయితే అనుకోకుండా తనకు కావలసిన పవర్ అంజనాద్రి అనే గ్రామంలో హనుమంతు దగ్గర ఉన్నాయని తెలుసుకున్న మైకేల్ అంజనాద్రికి వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? మైకేల్ నుంచి గ్రామాన్ని హనుమంతు ఎలా రక్షించాడు? తనకు కావలసిన దాని కోసం ఎంతకైనా తెగించే మైకేల్ ఎలాంటి పన్నాగాలు పన్నాడు? ఇందులో అంజనేయుడి పాత్ర ఏంటి? మొదటి నుంచి హీరోను ఆసహించుకునే మీనాక్షి, హనుమంతుల ప్రేమ కథ ఏమైందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

క‌థ‌నం-విశ్లేషణ:

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. సంక్రాంతి ముందు చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీకి థియేటర్లు దొరకడం చాలా కష్టమైంది. కానీ బాలీవుడ్ లో బిజినెస్ బాగానే జరగడంతో తెలుగులో థియేటర్లు దొరకలేదని మూవీని క్యాన్సిల్ చేస్తే నష్టపోతామని భావించిన మూవీ టీం దొరికిన కొన్ని థియేటర్లలోనే సినిమాను విడుదల చేయడానికి రెడీ అయింది. అయితే ఈ మూవీ జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంతకంటే ముందు జనవరి 11 న ప్రీమియర్ షోలు ప్లాన్ చేసింది చిత్రబృందం. అల్లరి చిల్లరగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తు ఎంతో బలహీనంగా ఉండటం అదే పవర్స్ వచ్చిన తరువాత ఇంటి తలుపులను ఈజీగా లాగేయడం లాంటివి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పస్టాఫ్ లో విజువల్స్ వండర్ అనే చెప్పాలి.గ్రాఫిక్స్ కూడా అద్బుతంగా ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన కోతి పాత్ర ఈ మూవీలో కీలకంగా మారింది. తన స్నేహితుడి దగ్గర తన పవర్స్ ను నిరూపించుకోవడానికి హీరో మరో హీరోలను ఇమిటెట్ చేయడం నవ్వుతెప్పిస్తుంది. శక్తులు వచ్చిన తర్వాత గ్రామ పాలెగాడి అరాచకాలను ఆపడానికి వారితో హీరో పోటీపడే సీన్ లో థియేటరు మొత్తం విజిల్స్ వినిపించాయి. ఇంటర్వెల్ సీన్ కూడా సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది.

సెకండాఫ్ లో మైకేల్ గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంటుంది. గ్రామంలో ఆసుపత్రి కట్టడానికి పెద్ద రాయిని తొలగిస్తున్నప్పుడు అది గ్రామ ప్రజలపై పడుతుంటే హీరో ఆ రాయిని శ్రీ కృష్ణుడు గొవర్థన పర్వతాన్ని ఎత్తినట్లు రెండు చేతులతో ఎత్తే సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. హీరోయిన్ ను చంపడానికి బందిపోట్లు వచ్చినప్పుడు అవకాయ పెడుతూ కొందరు అంజనేయుడి గురించి పడే పాట సినిమాకి మంచి హైప్ తీసుకొస్తుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్. ప్రశాంత్ వర్మ చాలా సార్లు చెప్పినట్లు మిగితా పార్టులపై ప్రేక్షకులలో ఆసక్తి రేకిత్తించడానికి క్లైమాక్స్ లోని ట్వీస్ట్ లు బాగున్నాయి. దాంతో నెక్ట్స్ వచ్చే సూపర్ హీరో గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు.

న‌టీ-న‌టులు:

పవర్స్ ఉన్నప్పుడు ఒకలా పవర్స్ లేనప్పుడు ఒకలా నటించి మెప్పించాడు తేజ సజ్జ. ఈ సినిమాతో అతను స్టార్ హీరో కూడా అయ్యే అవకాశం ఉంది. హీరోయిన్ గా చేసిన అమృత అయ్యర్ నటనతోను, అందంతోను ఆకట్టుకుంది. ఈ సినిమాలో విలన్ గా నటించిన వినయ్ రాయ్ తన నటనతో అందరి మన్ననలు పొందుతాడు. సూపర్ పవర్స్ పొందడానికి ఆరాటపడుతు, తనకు కావలసిన దానికోసం ఎంతకైనా తెగించే వాడిగా ఆకట్టుకున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ తమ్ముడి పై ప్రేమను చూపిస్తూ చక్కగా నటించింది. వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సత్య, రోహిణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

ప్రశాంత్ వర్మ రాసుకున్న తీరు తెరకెక్కిన విధానం అందరిని మెప్పిస్తుంది. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ల లీస్ట్ లో చేరిపోతాడు. దర్శకుడు ఈ చిత్రానికి వంద శాతం న్యాయం చేశాడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఎక్కడ రాజీపడకుండా నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గౌరహరి, కృష్ణ సౌరభ్‌లు అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. సినిమాటోగ్రాఫి దశరథి శివేంద్ర, ఎడిటర్ సాయిబాబు పనితనం బాగుంది.

ప్లస్ పాయింట్స్:

తేజ సజ్జ నటన

విజువల్స్ , గ్రాఫిక్స్

నేపథ్య సంగీతం

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ లో ఢల్ గా సాగిన సీన్స్

పంచ్‌లైన్: సంక్రాంతికి ప్రతి ఇంట్లో హనుమంతుడు ఉంటాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button