తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

సినిమా రివ్యూ: హాయ్ నాన్న

Pakka Telugu Rating : 2.75/5
Cast : నాని, మృణాల్‌ ఠాకూర్‌, శృతిహాసన్, బేబీ కియారా, అంగద్ బేడీ, జయరామ్‌, ప్రియదర్శి, విరాజ్‌ అశ్విన్‌ తదితరులు
Director : శౌర్యువ్
Music Director : హేషమ్ అబ్దుల్ వహాబ్
Release Date : 07/12/2023

దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని.. ఆ తర్వాత పూర్తి భిన్న‌మైన ఓ తండ్రీ కూతురు క‌థ‌ను ఎంచుకొని చేసిన సినిమా ‘హాయ్ నాన్న‌’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా.. శృతిహాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాతో శౌర్యువ్ కొత్త ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా ఇవాళ ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజై సందడి చేస్తోంది. మరి నాని నటించిన ఈ సినిమా ఎలా ఉంది? మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొడుతుందా? లేదా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.

కథ:

విరాజ్ (నాని) ముంబై‌లో ఓ ఫొటోగ్రాఫర్. అతనికి ఆరేళ్ల కూతురు మహి (బేబీ కియారా ) అంటే ప్రాణం. మహికి తల్లి లేకపోవడతోపాటు పుట్టుకతోనే ఓ అరుదైన వ్యాధి ఉంటుంది. దీంతో కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. కూతురిని ఆ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి విరాజ్ క‌థ‌లు చెబుతుంటాడు. అయితే ఇలా కథలు చెబుతుండగా.. మహి రియ‌ల్‌లైఫ్ వ్య‌క్తుల‌ను ఊహించుకుంటుంది. దీంతో అమ్మ ఉన్న కథే చెప్పమని పదేపదే అడగగా.. విరాజ్ మాత్రం ఆ క‌థ చెప్ప‌కుండా వాయిదావేస్తుంటాడు. ఈ సమయంలోనే మ‌హి జీవితంలోకి య‌శ్న (మృణాల్ ఠాకూర్‌) రావడం.. అదే రోజు మహికి విరాజ్ అమ్మ కథ చెబుతుంటాడు. అమ్మ పాత్రలో ఎవర్ని ఊహించుకోవాలని మహి అడగగా.. నన్ను ఊహించుకోమని యశ్న చెబుతోంది. కూతురికి విరాజ్ కథ ఎలా చెప్పాడు? విరాజ్‌, వర్ష లవ్ స్టోరీ ఏంటి? విరాజ్‌ను ప్రాణంగా ప్రేమించిన వ‌ర్ష (మృణాల్ ఠాకూర్‌) మ‌హి పుట్టిన త‌ర్వాత అత‌డికి ఎందుకు దూర‌మైంది? య‌శ్న‌కు వ‌ర్ష‌కు సంబంధం ఉందా? విరాజ్‌, వ‌ర్ష తిరిగి క‌లుసుకున్నారా? లేదా? అన్న‌దే హాయ్ నాన్న క‌థ‌.

క‌థ‌నం-విశ్లేషణ:

విరాజ్‌(నాని), మ‌హి(బేబి) అనుబంధంతో హాయ్ నాన్న సినిమా మొద‌ల‌వుతుంది. అయితే అమ్మ గురించి నాన్న తన కూతురుకి చెప్పే గొప్ప ప్రేమ కథ ఇది. అలాగే తండ్రీకూతుళ్ల మ‌ధ్య ఉండే ఎమోష‌న్స్‌ మ‌న‌సులను హ‌త్తుకునేలా డైరెక్టర్ స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అదే విధంగా లవ్‌స్టోరీలోని ట్విస్టులు కొత్తగా ఉండడంతోపాటు అమ్మ పాత్రని దర్శకుడు మలిచిన తీరు సినిమాను నిలబెట్టింది. కాగా, య‌శ్న ఎంట్రీతోనే క‌థ మ‌లుపులు తిరుగుతుంది. ఇలాంటి కథలు తెలుగు సినిమాల్లో చాలానే వచ్చాయి. కానీ హాయ్‌ నాన్నలో ప్రత్యేకత ఏంటంటే.. హీరో హీరోయిన్ల మానసిక సంఘర్షణ హృదయాలను హత్తుకుంటాయి. ఫస్టాప్‌లో విరాజ్‌, వ‌ర్ష మధ్య లవ్ స్టోరీ రోటీన్‌గా కనిపించింది. కథనం నెమ్మదిగా సాగడం కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక.. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో విరాజ్‌, య‌శ్న ల‌వ్‌స్టోరీ మాత్రం అద్భుతంగా ఉండడం.. య‌శ్న‌, వ‌ర్ష‌కు మ‌ధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేసే క్లైమాక్స్‌ సీన్స్, భావోద్వేగాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

న‌టీ-న‌టులు:

విరాజ్ పాత్ర‌లో నాని అద‌ర‌గొట్టాడు. కూతురి కోసం ఆరాట‌ప‌డే తండ్రిగా తనదైన సహజ నటనతో పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధానబలం. బాధ్యతగల తండ్రిగా, ప్రియుడిగా, భర్తగా..ఇలా డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన పాత్ర‌లో నాని చ‌క్క‌టి వేరియేష‌న్స్ చూపించాడు. వ‌ర్ష‌, య‌శ్న‌గా రెండు షేడ్స్‌తో సాగే పాత్ర‌లో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ ఆకట్టుకుంది. శృతిహాస‌న్ ఓ పాట‌లో మాత్ర‌మే క‌నిపిస్తుంది. బేబీ కియారా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. హీరో స్నేహితుడిగా ప్రియదర్శి తన పాత్ర పరిధిమేర నటించాడు. జయరామ్‌ రొటీన్‌ తండ్రి పాత్రలో కనిపించినా..క్లైమాక్స్‌లో అతనిచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికొస్తే.. హేషమ్ అబ్దుల్ వాహబ్ ప్రేక్ష‌కులను అలరిస్తుంది. సమయమా సాంగ్ సినిమాకే హైలెట్. స్టోరీకి తగ్గన విధంగా స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది. ఇక సాను జాన్ వ‌ర్గీస్ విజువ‌ల్స్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు ప‌ర్‌ఫెక్ట్ అని చెప్పాలి. డైరెక్టర్ శౌర్యువ్‌కి ఇదే తొలి సినిమా అయినా నానిని కొత్తగా చూపించడంలో సక్సెస్ సాధించారు. రోటీన్ స్టోరీ అయినప్పటికీ కొత్తగా భావోద్వేగాలను మేళ‌వించి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించడం డైరెక్టర్ సాహసమేనని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

తండ్రీకూతుళ్ల ఎమోషన్స్

నాని, మృణాల్, బేబి యాక్టింగ్

మ్యూజిక్, విజివల్స్, క్లైమాక్స్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్:

రోటీన్ సీన్స్

స్టో స్క్రీన్ ప్లే

పంచ్‌లైన్: ఫీల్‌గుడ్ ఎమోష‌న‌ల్ మూవీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button