తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: నా సామిరంగ

Pakka Telugu Rating : 2.5/5
Cast : నాగార్జున, ఆషికా రంగనాథ్, అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్, మిర్నా మేనన్, రుక్సర్‌ థిల్లాన్, షబ్బీర్‌ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్
Director : విజయ్‌ బిన్ని
Music Director : ఎం.ఎం.కీరవాణి
Release Date : 14/01/2024

అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ నా సామిరంగ. ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 14న థియేటర్స్ లోకి వచ్చింది. నాగార్జునకు జోడిగా ఆషికా రంగానాథ్ నటించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం పండుగకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అంతా భావిస్తున్నారు.ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరణ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!

కథ:

కృష్ణయ్య(నాగార్జున) ఓ అనాధ. ఆకలేస్తుందని అంజి(అల్లరి నరేష్) ఇంటికి వస్తే అతని తల్లి చేరదీస్తుంది. దీంతో కృష్ణయ్య ఆ కుటుంబంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో వాళ్ళు కట్టాల్సిన అప్పు కట్టాలి లేదా ఇల్లు జప్తు చేసుకుంటానని వరదరాజులు( రావు రమేష్)అంజి, కృష్టయ్యతో చెబుతుండట పెద్దయ్య(నాజర్) వచ్చి డబ్బులిస్తాడు. దీంతో కృష్ణయ్య పెద్దయ్య దగ్గర ఉండి ఆ ఊరిని, పెద్దయ్యని చూసుకుంటూ ఉంటాడు. ఒక కడుపులో పుట్టాకపోయిన కృష్ణయ్య, అంజి అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కథ ప్రారంభమవుతుంది. భాస్కర్(రాజ్ తరుణ్) పక్కూరి ప్రెసిడెంట్ కూతురు(రుక్సార్)ని ప్రేమించాడని తెలియడంతో వాళ్ళు భాస్కర్ ని చంపడానికి వస్తే కృష్ణయ్య కాపాడుతాడు. భాస్కర్ కృష్ణయ్యకి ప్రేమ ఉందా అని అంజిని అడగడంతో గతంలో చిన్నప్పటి నుంచి కృష్ణయ్య, వరాలు(ఆషిక రంగనాధ్)ప్రేమకు సంబంధించిన కథ చెబుతాడు. అదే సమయానికి దుబాయ్ నుంచి ఊళ్లోకి వచ్చిన పెద్దయ్య కొడుకు దాస్ వరాలుతో మిస్ బిహేవ్ చేయడంతో అంజి చూసి అతనితో గొడవకు దిగితాడు. దీంతో అంజి, కృష్టయ్యను వచ్చే సంక్రాంతి లోపు చంపుతానని దాస్ సవాల్ విసురుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? దాస్ సవాల్ లో నెగ్గాడా? వరాలు, కృష్టయ్య ప్రేమించుకున్న కానీ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? భాస్కర్,ప్రెసిడెంట్ కూతురి ప్రేమ వ్యవహారం ఎటు వైపు వెళ్లింది? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

క‌థ‌నం-విశ్లేషణ:

నా సామిరంగ సినిమా మలయాళం ‘పోరింజు జొస్ మరియమ్’ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఆ రీమేక్ ఛాయలు ఎక్కడా కనపడకుండా ఒరిజినల్ తెలుగు సినిమాగా పూర్తిగా మార్చారు. ప్రధాన పాత్రల చిన్ననాటి ఎపిసోడ్‌తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో కృష్ణయ్య, అంజిల బాల్యం, కృష్ణయ్య, వరాలు ప్రేమ కథ, అంజి పెళ్లి, దాస్ తో గొడవతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ, కామెడీతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.దాసు పాత్ర కథలోకి ప్రవేశించినప్పటి నుంచే సంఘర్షణ మొదలవుతుంది. ఇంటర్వెల్ లో పెద్దయ్య కొడుకు దాస్ తో గొడవ జరగడంతో ఒక యాక్షన్ సీన్ తో ఎంటర్వాల్ ఇచ్చిన తీరు బాగుంది. సెకండాఫ్ పై ఆసక్తిని కలిగిస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా దాస్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్ పండించి క్లైమాక్స్ లో రివెంజ్ డ్రామాలా యాక్షన్ సీన్ తో ముగిస్తారు. అయితే ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ముందుకి, వెన్కక్కి వెళ్తూ ఉంటుంది. దీంతో ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. దాసుల అంజిని చంపడానికి చేసే ప్రయత్నం నుంచి ఈ తర్వాత ఎమోషన్ కు ప్రేక్షకులు గురవుతారు. సెకండాఫ్ మొత్తం యాక్షన్, ఎమోషన్ తో సాగుతుంది.క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ నాగార్జున అభిమానులకు నచ్చుతాయి.

న‌టీ-న‌టులు:

నాగార్జున తన నటన, యాక్షన్స్ సీన్స్ తో మెప్పించాడు. ప్రేమ నిలబెట్టుకోవాలని ఆశపడుతూనే తనకు ఆపద వస్తే వాళ్ల కోసం నిలబడేవాడిగా మెప్పించాడు. అల్లరి నరేస్ కు కూడా నాగార్జునతో సమానమైన క్యారెక్టర్ లభించింది. గమ్యం మూవీలో అల్లరి నరేష్ క్యారెక్టర్ ఎలాగైతే ప్రేక్షకులకు గుర్తిండిపోతుందో ఈ క్యారెక్టర్ కూడా అలాగే అభిమానులకు గుర్తిండిపోతుంది. తన నటనతో ఆకట్టుకుంటాడు. సినిమాకి హీరోయిన్ ఆషిక రంగనాథ్ చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ప్రేమ కథలో ఓ యువతిలా, తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన పాత్రలో వ్యత్యాసం చూపిస్తూ బాగా నటించింది. మిర్నా మీనన్ అల్లరి నరేష్ భార్యగా మెప్పించింది. రుక్సార్, రాజ్ తరుణ్ లు ప్రేమ జంటగా పర్వాలేదనిపించారు. రాజ్ తరుణ్ పాత్ర పెద్దగా స్కోప్ లేదు. ఇక వరాలు తండ్రి పాత్రలో రావు రమేష్, పెద్దయ్యగా నాజర్, అతని చిన్న కొడుకు విలన్ పాత్రలో డ్యాన్సింగ్ రోజ్, జబర్థస్త్ మహేష్, రవివర్మ తమ పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

నా సామిరంగ సినిమాటోగ్రాఫర్ శివేంద్ర కెమెరామెన్ గా లొకేషన్స్, విజువల్స్ చక్కగా చూపించారు. ఇక మ్యూజిక్ ఎమోషనల్ , కొన్ని పాటలు బాగున్నా యాక్షన్ సీన్స్ లో ఇంకా బాగా ఇవ్వొచ్చు అనిపిస్తుంది. ఓవరాల్ గా పాటలు ఇంకా బాగుంటే బాగుండు అనిపిస్తుంది. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నాగార్జునకి ఇండస్ట్రీలో కొత్త దర్శకులని పరిచయం చేస్తాడని మంచి పేరుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. శ్రీనివాస్ చిట్లూరి ఎక్కడ రాజీపడకుండా సినిమాను నిర్మించినట్లు తెలుస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

నాగార్జున, అల్లరి నరేశ్‌ల నటన

యాక్షన్‌ ఎపిసోడ్స్‌

మైనస్ పాయింట్స్:

కథలో కొత్తదనం లోపించడం

పంచ్‌లైన్: నాగార్జున అభిమానులకు రెండు పండుగలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button