తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Ganpath: హీరో టైగర్‌ ష్రాఫ్ గణపథ్‌ టీజర్ … గూస్ బంప్స్ వచ్చేలా యాక్షన్ సీన్లు

టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గణపథ్. పూజా ఎంటర్టయిన్ మెంట్, గుడ్ కో ప్రొడక్షన్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రానికి వికాస్ బెహెల్ దర్శకుడు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, గణపథ్ తెలుగు వెర్షన్ టీజర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అన్నింటికి మించి తన గురువు అమితాబ్ బచ్చన్ నటించిన గణపథ్ చిత్రం టీజర్ పంచుకోవడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ చిత్రం విజయం సాధించాలంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

టీజర్ ప్రారంభంలో టైగర్ ష్రాప్ గుహలో ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. ప్రపంచానికి ఎలాంటి హోప్ లేనప్పుడు అంటూ, తినడానికి తిండిలేక జనాలు కొట్టుకునే పరిస్థితిని చూపిస్తారు. మనకోసం ఓ వీరుడు వచ్చేంత వరకు ఈ యుద్ధం మొదలు పెట్టొద్దు అనే వాయిస్ వినిపించగానే, గుహలో ధ్యానం చేసుకుంటున్న టైగర్ కనిపిస్తారు. ఆయనను చంపేందుకు ఓ బృందం వెళ్తె… వారిని చితకబాదుతారు. ఆ తర్వాత బాక్సింగ్ రింగులో ప్రత్యర్ధిపై తన మార్క్ షాట్లతో విరుచుకుపడతాడు. అటు కృతి సనన్ సైతం అదిరిపోయే యాక్షన్ తో ఆకట్టుకుంటుంది. అమితాబ్ బచ్చన్ సరికొత్త గెటప్ లో కనిపిస్తారు. మా వాళ్ల జోలికి వస్తే అస్సలు వదిలిపెట్టను అనే డైలాగ్ తో టీజర్ ఎండ్ అవుతుంది. టీజర్ తో మూవీ పై అంచనాలను చిత్రబృందం పెంచేసింది. గణపథ్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button