తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

The Kerala Story: ఓటిటిలోకి వచ్చేసిన ది కేరళ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటి రైట్స్ కూడా అమ్ముడు పోతుంటాయి. ఇక మరికొన్ని సినిమాల విషయంలో విడుదల తర్వాత కలెక్షన్ల ఆధారంగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేస్తాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నా కూడా ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కి నోచుకోలేకపోయాయి. అలాంటి సినిమాలలో ఒక సినిమానే ది కేరళ స్టోరీ.

Also read: Dil Raju: యంగ్ హీరో పెళ్లి.. నిర్మాత దిల్ రాజు స్టెప్పులు

ఆదా శర్మ, యోగితా బిహానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సుదిప్తో సేన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కలిపి ఈ సినిమాకు 28 కోట్లకుపైగా బడ్జెట్‌ ఖర్చయింది. మొత్తంగా సుమారుగా 35 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా ఇండియాలో 2000 స్క్రీన్లలో రిలీజైంది. ఎన్నో వివాదాల మధ్య గతేడాది మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది.

ఈ సినిమా మొత్తానికి భారీగా కలెక్షన్లను అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై చాలా రోజులైంది. ఇన్ని రోజులకు ఓటీటీ బిజినెస్ కాకపోవడంతో నిర్మాతలు ఈ సినిమాను కనీసం యూట్యూబ్‌ లో రిలీజ్ చేద్దామని ప్లాన్స్ కూడా చేశారు. కానీ ఆఖరి నిమిషంలో జీ 5 వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

3 Comments

  1. I was curious if you ever considered changing the structure
    of your blog? Its very well written; I love what youve got
    to say. But maybe you could a little more in the way of content so people
    could connect with it better. Youve got an awful lot of text for only having 1
    or two images. Maybe you could space it out better?

    My blog post vpn coupon 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button