తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Lal Salaam: లాల్ సలామ్ నుంచి సాంగ్ రిలీజ్… అదరగొట్టిన ఏఆర్ రెహమాన్

రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం లాల్ సలామ్. తాజాగా, ఈ చిత్రం నుంచి ఓ హుషారైన ‌సాంగ్ ని చిత్రబృందం విడుదల చేసింది. విష్ణువిశాల్‌, విక్రాంత్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది.

Also Read:  ఫ్రీ బస్ జర్నీకి భారీ రెస్పాన్స్.. జీరో టికెట్ల జారీలో రికార్డ్

ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సెకండ్ సింగిల్ విడుద‌ల చేశారు. జలాలీ అంటూ ఈ పాట సాగ‌గా…ఆస్కార్ అవార్డు విన్న‌ర్ A R రెహమాన్, శరత్ సంతోష్ క‌లిసి పాడ‌రు. రాకేందు మౌళి, మషూక్ రెహమాన్, ఏఆర్ రెహమాన్ సాహిత్యం సమకూర్చారు. అరబిక్, సూఫీ సంగీత సంప్రదాయానికి ర్యాప్ ను మిక్స్ చేసి ఈ పాట రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 09 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Also Read: ఏడో జాబితాపై వైసీపీ కసరత్తు..మూడు రోజుల్లో స్పష్టత!

లాల్ సలామ్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుభాస్కర్ నిర్మించారు. సెంథిల్, జీవిత రాజశేఖర్, తంబి రామయ్య, అనంతిక సనిల్ కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై తదితరులు నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button