తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Surya: సూర్య మూవీపై క్రేజీ ఆప్ డేట్…ఆసక్తిని క్రియేట్ చేసిన చిత్రబృందం

హీరో సూర్య ఇప్పుడు తన పాన్‌ ఇండియా చిత్రం కంగువ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇదీ పూర్తి అయిన వెంటనే తన 43వ చిత్రం కోసం దర్శకురాలు సుధా కొంగర, స్వరకర్త జివి ప్రకాష్‌తో మళ్లీ జతకట్టనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురూ ఇప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ఆకాశం నీ హద్దురా లో కలిసి పనిచేశారు.

సూర్య 43 ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ధృవీకరించారు. దుల్కర్ సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తకరమైన వార్త ఒకటి వైరల్‌ అవుతుంది. ప్రముఖ నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా ఈ మూవీ లో ఒక ప్రధాన పాత్రతో తమిళ సినిమాలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. కోలీవుడ్‌లో ఇది సెన్సేషనల్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు.

ఆమె గతంలో తమిళ చిత్రసీమలో భారీ హిట్‌ సినిమాల్లో నటించి పలు విజయాలను అందుకుంది. ఫహద్ ఫాసిల్‌తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆమె తగ్గించారని చెప్పవచ్చు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే, సూర్య 43లో విలన్‌గా నటించడానికి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెండితెరపై ఆతని విలనిజం సరికొత్తగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button