తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

MLA: ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా… అంతా ఫేక్ అంటున్న బీజేపీ

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతిపక్షపార్టీలు, అధికార పార్టీలు కావచ్చు ఏ చిన్న తప్పు చేసినా దానిని ఇతర పార్టీల అస్త్రాలుగా మార్చుకోవడానికి సిద్దంగా ఉన్నారు. అయితే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల లిస్టును ప్రకటించి మిగితా పార్టీల కంటే కొంచెం ముందు వరుసలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరాయి. రెండు పార్టీలకు కూడా అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ రెండు పార్టీలు ఇంకా లిస్టును ప్రకటించలేదు. అభ్యర్ధులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థుల లిస్టు తెగ వైరల్ అవుతుంది. ఇదే బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా అంటూ సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది బీజేపీ పార్టీ ప్రకటించిన లిస్ట్ కాదని…ఫేక్ లిస్ట్ అంటూ బీజేపీ నాయకులు స్పష్టంచేశారు.

నిర్మల్‌– ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్‌–లాలా ఓంప్రకాశ్‌ జైస్వాల్‌, ఖా నాపూర్‌– రాథోడ్‌ రమేశ్‌, బోథ్‌ – సో యంబాపురావు, సిర్పూర్‌– పాల్వాయి హారీశ్‌బాబు ల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటించినట్లు పేర్కొన్నారు. మిగితా నియోజకవర్గాలు కూడా అనుమానం రాకుండా ఉండేందుకు బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండిసంజయ్‌,ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డిల పేర్లు పెట్టారు. చాలామంది ఈ జాబితా వాస్తవమే అనుకుని, వారూ ఫార్వర్డ్‌ చేశారు. చివరకు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సోషల్‌ మీడియా ద్వారానే ఈ జాబితా పార్టీ ప్రకటన కాదని స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button