తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Thalaivar 170: రజినీకాంత్ Vettaiyan టైటిల్‌ టీజర్‌ రిలీజ్

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ నటిస్తోన్న మోస్ట్‌ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి తలైవా 170. జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తలైవా 170 టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు.

Also Read: ఈవారం ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు

ఈ చిత్రానికి Vettaiyan టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. బుక్‌ రీడింగ్‌ తర్వాత చేతిలో స్టిక్‌ పట్టుకొని.. స్టైలిష్‌ గాగుల్స్‌ పెట్టుకున్న రజినీకాంత్‌ విజువల్స్‌ అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ అందించడం ఖాయమని చెప్పకనే చెబుతున్నాయి. ఏడు పదుల వయస్సులోనూ అదే స్టైల్‌ తో ఔరా అనిపిస్తున్నాడు తలైవా. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Also Read: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ ట్రైలర్ విడుదల

ఇటీవలే సెట్స్‌లో నుంచి షూటింగ్‌ స్పాట్‌లో రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ స్టిల్‌ను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో గురు ఫేం రితికా సింగ్ ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button