తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్సినిమా

Balayya: బాలకృష్ణ మూవీని బ్యాన్ చేసిన కేంద్రం

నందమూరి బాలకృష్ణ… ఈ పేరంటే అభిమానులకు ఓ పూనకం. బాక్సాఫీసుకు పండగ. మాస్ యాక్షన్ చిత్రాలకు అతనే కేరాఫ్ అడ్రస్. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా రాణిస్తున్నారు. మరోవైపు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు అన్‌స్టాపబుల్ షోకు హోస్ట్‌గా కేక పుట్టిస్తున్నాడు. 60 ప్లస్ ఏజ్‌లో కేక పుట్టిస్తోన్న ఈయన నటించిన ఓ సినిమాను కేంద్రం బ్యాన్ చేసింది. ఇంతకీ ఏమిటా సినిమా ? ఏందా కహాని మీరు ఓ లుక్కేయండి.

అయితే హీరోగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో తెరంగేట్రం చేశాడు బాలయ్య. ఈ సినిమాకు ఎన్టీఆర్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమాను విడుదల కాకుండా కేంద్రం బ్యాన్ విధించింది.

70వ దశకంలో కేంద్రం కుటుంబ నియంత్రణ పాటించాలని .. ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు కనాలనే కండిషన్ పెట్టింది. ఈ కాన్సెప్ట్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ గంపెడు పిల్లలున్న సంసారం నేపథ్యంలో ‘తాతమ్మ కల’ను తెరకెక్కించారు. అప్పట్లో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో ఈ సినిమా విడుదలను అడ్డుకుంది.

ఆ తర్వాత సరిగ్గా పదేళ్లకు ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమా పై కేంద్రం ఇలాంటి సెన్సార్ ప్రాబ్లెమ్స్‌ను గురి చేసింది.

బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే.. చెప్పిన టైమ్‌‌కు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button