తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Naa Sami Ranga: సంక్రాంతి బరిలో నా సామిరంగ.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ లో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. గతంలో వరుసగా హిట్లను సొంతం చేసుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. అయినా ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు.

Also read: Balayya: బాలయ్య 109 సినిమాపై కీలక అప్డేట్.. షూటింగ్ అక్కడే

నాగార్జున రీసెంట్ గా చేసిన బంగార్రాజు సినిమా హిట్ టాక్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఘోస్ట్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రమే ‘నా సామిరంగ’. ఫేమస్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని హై రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘నా సామిరంగ’ మూవీ షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుస షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ‘నా సామిరంగ’ మూవీని జనవరి 14 విడుదల చేయబోతున్నారు. దీనిపై ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో ‘బంగార్రాజు’ జనవరి 14న వచ్చి హిట్ అయింది. అలాగే, ‘సోగ్గాడే చిన్ని నాయన’ జనవరి 15వ వచ్చి సక్సెస్ అయింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే అని నాగార్జున ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నా సామిరంగ’ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button