తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Baby Movie: బేబీ మూవీ డైరెక్టర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. ఏంటంటే?

టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం అందుకున్న మూవీ బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించగా.. శ్రీనివాస కుమార్ నిర్మించారు. చాలా కాలం తరువాత వచ్చిన అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో బేబీ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు.

దీంతో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇటీవలే 50 డేస్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఓటీటీలో కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా.. కేవలం 32 గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా ఇంతటి భారీ విజయాన్ని సాధించడంతో.. నిర్మాత SKN దర్శకుడు సాయి రాజేష్ కు ఖరీదైన బ్రాండ్ న్యూ మోడల్ బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button