తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Breathe: హీరోగా నందమూరి చైతన్యకృష్ణ… ఆసక్తిని రేకెత్తిస్తున్న బ్రీత్ ట్రైలర్!

నందమూరి చైతన్యకృష్ణ హీరోగా ‘బ్రీత్’ సినిమా రూపొందింది. గతంలోనే ఎంట్రీ ఇచ్చిన చైతన్య కృష్ణ, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా ఇది. నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో గాయాల పాలైన పేషంట్ గా కనిపిస్తూ, హాస్పిటల్లోనే హత్య చేయడాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. హాస్పిటల్ నేపథ్యంలోనే కథ ఎక్కువగా నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. గతంలో వంశీకృష్ణ ఆకెళ్ల ‘ది ట్రిప్’ .. ‘రక్షా’ అనే సినిమాలను తెరకెక్కించాడు. కొంత గ్యాప్ తరువాత ఆయన రూపొందించిన ‘బ్రీత్’ ఇప్పుడు విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి చైతన్యకృష్ణ ఇక వరుస సినిమాలు చేస్తాడేమో చూడాలి.

2003లోనే ఆయన ధమ్ అనే సినిమా చేశాడు కానీ అది విడుదలయింది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ఇదే ఆయన ఎంట్రీ అన్నట్టుగా నందమూరి ఫాన్స్ చెబుతున్నారు. ధమ్ సినిమాలో నందమూరి చైతన్యకృష్ణ కనిపించాడు కానీ అది వర్కౌట్ కాకపోవడంతో బ్రీత్ సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటున్నారు. తన కుమారుడు చైతన్య కృష్ణను హీరోగా నిలబెట్టడం కోసమే జయకృష్ణ స్వయంగా బసవతారకం క్రియేషన్స్ అనే ఒక బ్యానర్ ఏర్పాటు చేసి ఈ బ్రీత్ సినిమాని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button