తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Dhanraj: నా ప్రేమ మొదలైంది నీతోనే నాన్న… ‘రామం రాఘవం’ గ్లింప్స్ రిలీజ్

నటుడు సముద్రఖని, జబర్థస్త్ ధనరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రామం రాఘవం. ఈ సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నాడు. రామం రాఘవం మూవీ తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ నేపథ్యంలో వ‌స్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌ట‌కే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా.. మంచి స్పంద‌న లభించింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ గ్లింప్స్ అప్‌డేట్ ఇచ్చారు.

Also Read:  అల్లరి నరేష్ మూవీ అప్డేట్.. కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు

ఈ సినిమాలో తండ్రిపాత్రలో సముద్రఖని .. కొడుకు పాత్రలో ధన్ రాజ్ నటిస్తున్నారు. సహజత్వానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరిస్తున్నారనే విషయం ఈ గ్లిమ్స్ ద్వారా అర్థమవుతోంది. ఇటు తెలంగాణ .. అటు ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. హరీశ్ ఉత్తమన్ , మోక్ష, శ్రీనివాస రెడ్డి, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button