తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Guntur Karam: ’గుంటూరు కారం‘ కలెక్షన్స్‌.. ఆల్ టైమ్ రికార్డ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాగా, ఈ సినిమా మొదటి రోజు నుంచి మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. తాజాగా, ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌ను సినిమా యూనిట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. గుంటూరు కారం తొలి వారంలో రూ. 212 కోట్లు వసూల్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

ALSO READ: ఓటీటీలోకి ‘సలార్‌’..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఇది మూడోసారి..

గుంటూరు కారం సినిమా ఒక ప్రాంతీయ భాషలో మాత్రమే విడుదలై.. తొలి వారంలో ఇంత మొత్తంలో కలెక్షన్స్‌ రావడం ఇదే అరుదైన రికార్డ్‌. ఈ మేర‌కు మ‌హేష్ బాబు కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఆల్ టైమ్ రికార్డ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కాగా, మహేశ్ బాబు కెరీర్​లో రూ.200+ గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇది మూడోసారి. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా.. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించగా.. థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button