తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman: ఓటీటీలోకి హనుమాన్..! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, కొరియన్, జపనీస్ భాషల్లో రిలీజై అందరి ప్రశంసలు పొందింది. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందోనని ఓటీటీ లవర్స్ ఎప్పటినుంచో ఎదరుచూస్తున్నారు. దీనికి సంబంధించి బిగ్ అప్‌డేట్ అందింది. మార్చి 8 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: లైఫ్ లాంగ్ మనిషిని ముట్టుకోకుండా ఉండగలవా?… ‘గామి’ ట్రైలర్!

ఈ సినిమాను ఓటీటీలో ఫిబ్రవరిలోనే విడుదల చేద్దామని మొదట్లో భావించారు. అయితే, అప్పటికి ఇంకా చాలా థియేటర్లలో ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుండటంతో మార్చికి వాయిదా వేశారు. మార్చి 1 లేదా 2వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన జీ5 మార్చి 8 నుంచి ‘హనుమాన్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా వెల్లడించింది. మార్చి 8న మహాశివరాత్రి పండుగతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉంది. ఈ సందర్భంగా ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button