తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

HanuMan: ఓటిటి స్ట్రీమింగ్ పై సస్పెన్ష్.. టీవీలోకి వచ్చేస్తున్న హనుమాన్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే హనుమాన్ మూవీ ఓటిటి రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై ఇప్పటికీ జీ5 ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం అప్పుడే టీవీ ప్రీమియర్ కు సిద్ధమైపోయింది. కలర్స్ సినీప్లెక్స్ ఛానల్ హనుమాన్ మూవీని ప్రసారం చేయనుంది. హనుమాన్ మూవీ టీవీ ప్రీమియర్ డేట్ ను శుక్రవారం కలర్స్ సినీప్లెక్స్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసింది.

Also read: Sanjay Dutt: పుష్ప-2 నుంచి అప్డేట్.. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్?

హనుమాన్ మూవీ వచ్చే శనివారం రాత్రి 8 గంటలకు కలర్స్ సినీ ప్లెక్స్ ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. “విశ్వంలో తొలి సూపర్ హీరో ఇప్పుడు టీవీ స్క్రీన్లపై రాబోతున్నాడు. మార్చి 16 రాత్రి 8 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హిందీలో తొలిసారి కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమాల్లో చూడండి” అని ఆ ఛానల్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button