తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Nagababu: పోలీస్ క్యారెక్టర్లు వారికే సూట్ అవుతాయి… క్షమాపణలు కోరిన నాగబాబు

హీరో వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం కారణంగా వరుణ్ గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అంత సాఫీగా సాగింది అనుకునే లోపు కాంట్రవర్సీ ఎదురైంది. ఈ ఈవెంట్ లో వరుణ్ తండ్రి నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.

Also Read: భారత్‌ను కించపరిచిన సింగర్ చిన్మయి… గచ్చిబౌలిలో కేసు నమోదు

ఇటీవల జరిగిన వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వరుణ్ తేజ్ కు పోలీస్, ఆర్మీ పాత్రలు సరిగ్గా సరిపోతాయని… 5.3 అడుగుల ఎత్తున్న వ్యక్తికి ఆ పాత్రలు సరిపోవని ఆయన అన్నారు. ఒక హీరోని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో తన వ్యాఖ్యలు వెనకకు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Also Read: భయపెడుతున్న హార్రర్ సన్నివేశాలు… తంత్ర ట్రైలర్ రిలీజ్

పోలీస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుందని… 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడానని నాగబాబు చెప్పుకొచ్చారు. ఆ మాటలను తాను వెనక్కి తీసుకుంటున్నానని… ఎవరైనా ఆ మాటలకు నొచ్చుకునుంటే… అయాం వెరీ సారీ అని అన్నారు. ఆ మాటలు యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ, కావాలని అన్న మాటలు కాదని చెప్పారు. అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button