తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Neru: ఓటీటీలోకి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్లో విడుదలయ్యే సినిమాలు టీవీల్లోకి ఏడాది తర్వాత వచ్చేవి. కానీ ఇంటర్ నెట్ పుణ్యమా ట్రెండ్ మారింది. ఎంత పెద్ద హీరో అయినా పెద్ద బడ్జెట్ సినిమాలు సైతం విడుదలయిన నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా, మాలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నెరు’ ఓటీటీలోకి వచ్చేసింది.

ALSO READ: దేవర షూటింగ్ లో ప్రమాదం.. మూవీ రిలీజ్ పై అనుమానాలు

తెలుగు వెర్షన్‌లో..

ఈ సినిమా ప్రభాస్‌ ‘సలార్’కి పోటీగా మలయాళంలో డిసెంబర్ 21న రిలీజ్ అయింది. కోర్టు రూమ్ డ్రామా చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచింది. కేరళలో రూ.47 కోట్లు వసూళ్లు చేయగా.. వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్లకు పైగా రాబట్టింది. దృశ్యం ఫేమ్‌ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో మోహన్‌లాల్, ప్రియమణి నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button