తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Rajamouli: దేశ సమస్యను… సినిమాపై రుద్దడంతో తలపట్టుకుంటున్న రాజమౌళి

గత కొంత కాలంగా ఇండియాలో హట్ టాఫిక్ ఇండియా పేరు మార్పు. ఈ విషయంపై పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం బిల్లు కూడా ప్రవేశపెట్టాలి భావిస్తుంది. ఇండియా పేరును భారత్ గా మార్చలని చూస్తుంది. ప్రతిపక్షాలు దీనిపై మండిపడుతున్నాయి. తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టినందుకే ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయం ఇప్పడు రాజమౌళికి తలనొప్పిగా మారింది.

దర్శధీరుడు రాజమౌళి తాజాగా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆద్యుడు దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ను ఆయన సమర్పిస్తున్నారు. మేడ్‌ ఇన్‌ ఇండియా పేరిట ఇది రూపొందనుంది. అయితే, ఈ విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. దీని పేరు విషయంలో కొందరు అభిమానులు కామెంట్ల సెక్షన్‌లో ఆయనకు సూచనలిస్తున్నారు. మేడ్‌ ఇన్‌ ఇండియా బదులు మేడ్‌ ఇన్‌ భారత్‌ గా మార్చాలంటూ కొందరు రాజమౌళికి ట్వీట్‌ చేస్తున్నారు. టైటిల్‌లో ఇండియాను తీసేసి భారత్‌ను చేర్చండని కామెంట్స్‌ పెడుతున్నారు. దీనిపై చిత్రబృందం స్పందించలేదు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. భారత చలనచిత్ర పరిశ్రమ ఎక్కడ పుట్టింది, దానికి మూలం ఏంటి అనే కథతో ఇది రూపొందనుంది. నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కథ వినగానే తానెంతో భావోద్వేగానికి గురైనట్లు రాజమౌళి తెలపడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button