తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ram Charan Tej: బాలీవుడ్ లోకి రామ్ చరణ్ రీఎంట్రీ.. ఆ డైరెక్టర్ తోనే సినిమా?

‘గేమ్‌‌ చేంజర్‌‌‌‌’ చిత్రంతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు తెరకెక్కించే స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్‌‌ పై ఉండగానే మరో కొత్త సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అదికూడా హిందీ సినిమాకు. బాలీవుడ్‌‌ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ఉండబోతోందని గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం ఓ హిందీ సినిమాకు చరణ్‌‌ సైన్‌‌ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి.

Also read: The Family Star: ఫ్యామిలీ స్టార్ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

ఇది భన్సాలీ సినిమానేనా లేక మరొకరి డైరెక్షన్‌‌లోనా అనేది తెలియాల్సి ఉంది. 2013లో ‘జంజీర్‌‌‌‌’ అనే యాక్షన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. తెలుగులో ‘తుఫాన్‌‌’ పేరుతో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ నిరాశ పరిచింది. దీంతో తిరిగి హిందీ సినిమాలపై చరణ్ ఆసక్తి చూపించలేదు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ అవడం, రామ్ చరణ్‌‌ తన నటనతో మెప్పించడంతో, హిందీ ఫిల్మ్ మేకర్స్‌‌ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాకు చరణ్ సైన్ చేసినట్టు సమాచారం. మరి ఈ రీఎంట్రీ ప్రచారంలో నిజానిజాలేమిటో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button