తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Rana: హను మాన్ సీక్వెల్‌లో హనుమంతుడిగా ప్రముఖ హీరో… ఇందులో నిజమేంత?

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్‌వర్మ, హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం హను మాన్. సంక్రాంతి కానుక‌గా జనవరి 12 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ముందే చిత్రబృందం ప్రకటించడంతో సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

Also Read: సలార్-2 నుంచి కీలక అప్డేట్.. అసలు కథ అదేనా?

‘హనుమాన్‌’కు సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్ కు సంబంధించి ఇప్ప‌టికే స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని ప్ర‌శాంత్ వ‌ర్మ వెల్ల‌డించాడు. కాగా ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో హనుమంతుడి పాత్రను పోషించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రానా కూడా హనుమంతుడి రోల్‌లో బాగా సెట్ అవుతాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనిపై అధికారికంగా ప్రశాంత్ వర్మ ప్ర‌క‌ట‌న చేయవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button