తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Roti Kapda Romance: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ స్పెషల్ అప్డేట్

టాలీవుడ్ యువనటీనటులు హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. ఈ సినిమాకు విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి సృజన్‌ కుమార్ బొజ్జం నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తాజాగా, మేకర్స్ ఈ మూవీ అప్డేట్ ప్రకటించారు.

ALSO READ: అందుకే దూరంగా ఉన్నాను: రష్మిక

స్పెష‌ల్ వీడియో విడుద‌ల

ఈ సినిమా నుంచి మేక‌ర్స్ పెయిన్ ఆఫ్ ‘రోటి కపడా రొమాన్స్‌’ పేరిట ఫిబ్ర‌వరి 27న సాయంత్రం 5:04 నిమిషాలకు స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ట్విట్టర్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇది న‌లుగురు స్నేహితుల క‌థ. వారి స్నేహం, ప్రేమ‌, జీవిత ప్రయాణం వంటివి ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నేటి యువ‌త‌రాన్ని అమితంగా ఆక‌ట్టుకోవడంతోపాటు కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే భావోద్వేగాలు ఉన్నాయని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button