తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Saindhav: వెంకటేశ్ ‘సైంధవ్‌’ ట్రైలర్ రిలీజ్ డేట్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ హీరో వెంకటేశ్, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్’. వెంకటేష్‌ 75వ చిత్రంగా నటిస్తున్న ఈ సినిమా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్‌తో పాటు పాట‌లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ అప్‌డేట్ ప్రకటించారు.

ALSO READ: అభిమానులకు ఎన్టీఆర్ గుడ్ న్యూస్.. ‘దేవర‘ గ్లింప్స్ పై కీలక ప్రకటన

కొత్త సంవత్సరం కానుక‌..

కొత్త సంవత్సరం కానుక‌గా ‘సైంధ‌వ్’ ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 3న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా ఈ సినిమాకు ఇటీవల సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ అందించిన సంగతి తెలిసిందే. 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా వస్తోంది. కాగా, ఇందులో వెంకటేశ్ కూతురు ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో బాధ పడుతుందని, ఆ వ్యాధి చికిత్స కోసం రూ.17 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరం అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ విలన్‌కు కూడా అవసరం కావడంతో ఒకటే ఇంజక్షన్ ఉండటంతో ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుందని సమాచారం. అయితే దీనిపై వస్తున్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button