తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Skanda Movie: స్కంద మూవీకి ఫస్ట్ డే పాజిటీవ్ కలెక్షన్స్

అసలు ‘స్కంద’ సినిమాలో ఏముంది… నరుకుడే నరుకుడు… అనే టాక్ మార్నింగ్ ఫస్ట్ షోకే వచ్చినప్పటికీ ఈవెనింగ్ నుంచి సింగల్ స్క్రీన్స్ ఫుల్స్ పడడంతో ఆల్ సెంటర్స్ లో ఫస్ట్ డే దుమ్ముదులిపేశాడు రామ్ పోతినేని. బోయపాటి మాస్ జాతరకు భారీ కలెక్షన్స్ ఇచ్చారు మాస్ ఆడియెన్స్. బోయపాటి అంటేనే కేరాఫ్ మాస్ సినిమా… ఈ విషయం జనాలకు తెలుసు కాబట్టే లాజిక్స్ పక్కకు పెట్టి స్కంద సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ ఊచకోతకు ఫస్ట్ డే బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్లకు పైగా షేర్, 13 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కలుపుకొని.. 10 కోట్లకు పైగా షేర్‌, 18 కోట్ల వరకు గ్రాస్‌ వసూలు చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా 46 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న స్కంద… 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది. డే వన్ 10 కోట్లు వచ్చాయి అంటే… మరో 37 కోట్ల కోట్లు రాబడితేనే స్కంద బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే.

ఫస్ట్ వీక్‌లోనే స్కంద బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ఈ సినిమాకు వీకెండ్‌తో పాటు హాలీడేస్ కలిసి రానున్నాయి. మండే వరకు స్కందకు తిరుగు లేదు. ప్రస్తుతం థియేటర్లో స్కందకు పోటీ లేకుండా ఉంది. చంద్రముఖి2 రిలీజ్ అయినా… ఆ సినిమా పై మినిమమ్ బజ్ కూడా లేదు కాబట్టి రామ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబ్టటిన సినిమాగానే కాదు… హైయెస్ట్ గ్రాసర్‌గా స్కంద నిలిచేలా ఉంది. ఇక బోయపాటి మార్క్ యాక్షన్… రామ్, శ్రీలీల పెయిర్.. ముఖ్యంగా వీళ్ల డ్యాన్స్‌కి థియేటర్లో మాస్ జాతర చేస్తున్నారు ఆడియెన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే… ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన స్కంద సినిమా బీ,సి సెంటర్లలో కుమ్మెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button