తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tillu Square: తెగ వైరలవుతున్న ‘టిల్లు స్క్వేర్​’ ట్రైలర్

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్​లో నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్​’. ‘డీజే టిల్లు’కి సీక్వెల్​గా రూపొందిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనుపమ హాట్ లుక్, లిప్ లాక్స్‌తో ఈ ట్రైలర్ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ 4 మిలియన్లకు పైగా వ్యూస్ సొంత చేసుకుంది. ఈ విషయాన్ని చెబుతూ మేకర్స్ సోషల్ మీడియాలో మరో కొత్త పోస్టర్ వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ ‌అవుతోంది.

ALSO READ: మళ్లీ సినిమాల్లోకి మెగా డాటర్.. షూటింగ్ ప్రారంభం

ఆకట్టుకున్న సన్నివేశాలు..

టిల్లుకు పెళ్లి చేసేందుకు వాళ్ల బంధువులు ఓ పెళ్లి కూతురు ఫోటో పట్టుకొని ఇంటికి వస్తారు. ఈ పెళ్లి వద్దు అని చెప్పి తర్వాత తన లవ్ స్టోరీని చెబుతాడు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాగా, ఈ సినిమాకు రామ్ మిరియాల సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇక ఈ సినిమా మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button