తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Upasana Konidela: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన..సెకండ్ ప్రెగ్నెన్సీపై హింట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య‌ ఉపాసన మెగా అభిమానులకు శుభవార్త చెప్పింది. తాజాగా, జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యంపై మాట్లాడుతూ.. తాను రెండో బిడ్డకు జన్మనిచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిపింది. అయితే ఈ విషయంలో మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించింది. చివరికి తన ప్రెగ్నేన్సీపై అడిగిన ప్రశ్నకు ఆమె ‘మై హెల్త్ మై ఛాయిస్’ అని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ:  తండ్రి అయిన టాలీవుడ్ హీరో.. ఫ్యాన్స్ విషెస్

మహిళలదే నిర్ణయం..

ఉపాసన అపోలో ఆస్పత్రికి వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించడంతోపాటు మెగా కోడలిగా త‌న కుటుంబ బాధ్యతలను నిర్వ‌ర్తిస్తుంది. మరోవైపు ఆమె సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. కాగా, రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్న దాదాపు 10 ఏళ్ల తర్వాత క్లీంకారకు జన్మనిచ్చారు. పిల్లలు కనే విషయంలో ఈ జంటకు ఎన్ని ప్రశ్నలు ఎదురైనా సహనంతో ఉన్నారు. అయితే ఈ విషయంపై లైఫ్​లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయమని చెప్పింది. ఇలాంటి డెసిషన్ తీసుకున్నందుకు తానేమీ బాధపడలేదని స్పష్టత ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button