తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

valentine’s day Special: ప్రేమ పరీక్షలో గెలిచిన ‘రియల్’ హీరోలు..!

ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే.. ఇది ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈరోజును ఎంతో ప్రత్యేకంగా, ఒక మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోయేలా జరపుపుకోవాలని చాలా మంది ప్రేమికులు అనుకుంటూ ఉంటారు. అమెరికా, కెనడా, మెక్సికో, యునైటైడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అయితే పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలను మనదేశంలో కొంతమంది వ్యతిరేకిస్తుండగా, మరికొందరు ప్రేమికులు సమర్థిస్తూ ఈరోజున ఏవేవో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమ పరీక్షలో గెలిచి పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరోల గురించి మనం తెలుసుకుందాం.

ప్రేమతో మొదలై.. పెళ్లితో ఒక్కటై…

ALSO READ: లావణ్యపై నాగబాబు ప్రశంసలు… వైరలవుతున్న పోస్ట్

శ్రీకాంత్-ఊహ: ‘ఆమె’ సినిమా షూటింగ్‌ సమయంలో అంటే, 1994లో శ్రీకాంత్‌, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రెండు, మూడు చిత్రతాల్లో నటించారు. ఆ పరిచయం కాస్తా ప్రేమలా మారింది. 1997 జనవరి 20న వీరిద్దరు పెళ్లి చేసుకొని, ప్రేమలో విజయం సాధించారు.
నాగార్జున-అమల: అన్యోన్యతకు మారుపేరుగా నిలిచే జంట నాగార్జున-అమలది. కిరాయి దాదా మూవీ సెట్స్‌లో కలుసుకున్న వీరిద్దరు ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇరువురు కుటుంబ సభ్యుల అంగీకారంతో 1992లో (జూన్ 11న) వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్దం, చినబాబు, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు.
మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్: సూపర్ స్టార్ మహేశ్ బాబు లవ్ స్టోరీ ఎంతో ప్రత్యేకం. 2000 సంవత్సరంలో వంశీ చిత్రంలో మహేశ్‌ బాబు- నమ్రతకు పరిచయం ఏర్పడింది. పరిచయమైన కొద్దిరోజుల్లోనే వీరి మనసులు కలిశాయి. దాదాపు ఐదేళ్లపాటు రహస్యంగా తమ బంధాన్ని కొనసాగించారు. అనంతరం 2005లో పెళ్లితో ఒక్కటయ్యారు.

ఇంకా ఎన్నో ప్రేమ కథలు

వీళ్లే ఇంకా ఎంతో మంది టాలీవుడ్ హీరోలు ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్నారు. కృష్ణ- విజయ నిర్మల, అల్లు అర్జున్-స్నేహ, రామ్ చరణ్-ఉపాసన, నాని-అంజనా, నాగచైతన్య-సమంత (ప్రస్తుతం విడిపోయారు), వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తదితరులు ఈ లిస్ట్‌లో కనిపిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button