తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Venkatesh: సైంధవ్ నుంచి నా బుజ్జికొండవే.. సాంగ్ రిలీజ్

వెంకటేశ్‌ నటించిన 75వ చిత్రం ‘సైంధవ్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించగా ఈ పాన్‌ ఇండియా సినిమాని వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read: ఓటీటీలోకి ‘హాయ్‌ నాన్న’… ఎప్పుడంటే?

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి ‘‘బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే’’ అనే గీతాన్ని విడుదల చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతుర్ని తలచుకుంటూ తండ్రిగా వెంకటేశ్‌ పడే ఆవేదనని ఈ పాటలో భావోద్వేగభరితంగా చూపించారు. ఈ గీతానికి సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. ఎస్పీ చరణ్‌ ఆలపించారు. ఈ పాటను బట్టి సినిమా ప్రధానంగా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగనున్నట్లు అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button