తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: జనసేనకు స్టార్ క్యాంపెయినర్లు.. జబర్దస్త్ నటులే దిక్కు!

ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. క్షణం తీరిక లేకుండా పార్టీల అధినేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రతో దూసుకెళ్తున్నారు. మరోవైపు టీడీపీ కూటమి ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాను చూసిన ప్రజలు, కార్యకర్తలు నీరుగారిపోగా.. తాజాగా ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్లను చూసిన రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు.

ALSO READ: నామినేషన్ వేసేందుకు సీఎం జగన్ ముహూర్తం ఫిక్స్! అక్కడే రెండురోజులు మకాం!

కనీస అవగాహన ఉందా ?

ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను జనసేనాని పవన్ కళ్యాణ్ నియమించారు. అయితే ఏ పార్టీ అయిన ప్రముఖ రాజకీయ, సినిమా స్టార్‌లను క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్.. ఇతర టీవీ షోల్లో కామెడీ కార్యక్రమాలు వేసే కామెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. డాన్స్ మాస్టర్ జానీ, హైపర్ ఆది, గెటప్ శీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీలను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుని రాజకీయ ప్రచారం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్‌ అంబటి రాయుడు ఉన్నారు. వాస్తవానికి వాళ్లకు రాజకీయాలు గురించి ఏమైనా తెలుసా? వాళ్లకు కనీస అవగాహన ఉందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ALSO READ: సంచలన సర్వే.. వైసీపీకే మళ్లీ పగ్గాలు!

చందాలకే పరిమితం!

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కేవలం చందాలు వసూళ్లు చేసేందుకే పరిమితమయ్యారు. ఎప్పుడూ వసూళ్లలో ముందే ఉండే నాగబాబు.. గత కొంతకాలంగా ఎక్కడా ప్రచారసభల్లోకి వెళ్లడం లేదు. కనీసం జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. కొంతమంది అనగా టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరూ కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందిన పేదలు, లబ్దిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటూ ప్రకటించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button