తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: రాజకీయ చరిత్రలో తొలిసారి..నరసరావుపేట ఎంపీ టికెట్‌ బీసీకే!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తోంది. ఇప్పటి వరకు ఏడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. తాజాగా నరసరావుపేట పార్లమెంట్‌ టికెట్‌పై చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నరసరావుపేట పార్లమెంట్‌కు మాజీ మంత్రి పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించింది. దీంతో బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ALSO READ: రాజ్యసభలో ఉనికి కోల్పోతున్న టీడీపీ! క్యాడర్‌లో గందరగోళం

రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి

బీసీలు అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ అని సీఎం జగన్ నిరూపించారు. నరసరావుపేట లోక్‌సభ చరిత్రలో ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా ఎంపీగా ఎన్నిక కాలేదు. ఈ పార్లమెంట్ పరిధిలోని పల్నాడు ప్రాంతంలో సుమారు నలభై వరకు బీసీ ఉప కులాలు ఉన్నాయి. అయినా ఇప్పటివరకు అగ్ర వర్ణాలకు చెందిన వారే ప్రాతినిధ్యం వహించారు. 1952 నుంచి 2019 వరకు 15సార్లు పార్లమెంట్‌ ఎన్నికలు జరిగినప్పటికీ ఏ రాజకీయపార్టీ కూడా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఈ ధోరణికి వైఎస్‌ జగన్‌ చెక్ పెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు అన్ని స్థానాల్లోనూ బీసీలకు అత్యధిక స్థానాలను కేటాయించి వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ALSO READ: పవన్ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు

ప్రాతినిధ్యం వహించిన నాయకులు వీళ్లే

నరసరావుపేట పార్లమెంటు స్థానానికి రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న పార్లమెంటు స్థానానికి తొలిసారిగా సీఎం జగన్ బీసీలకు కేటాయించారు.

1.సి.రామయ్యచౌదరి

2.మద్ది సుదర్శనం

3.కాసు బ్రహ్మానందరెడ్డి

4.కాటూరి నారాయణస్వామి

5.కోట సైదయ్య

6.కాసు వెంకటకృష్ణారెడ్డి

7.కొణిజేటి రోశయ్య

8.నేదురుమల్లి జనార్దనరెడ్డి

9.మేకపాటి రాజమోహన్‌రెడ్డి

10.మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

11.రాయపాటి సాంబశివరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button