తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Chandrababu: బయటపడ్డ బాబు భూదోపిడీ బాగోతం… మరి ఇంత దారుణమా?

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు భూ దోపిడీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 4 కేటగిరీల కింద అమరావతిలో దోపిడీ చేసిన 1,072 ఎకరాల అసైన్డ్‌ భూములకు చంద్రబాబు, నారాయణ గ్యాంగ్‌ హస్తగతం చేసుకున్నట్లు తెలుస్తుంది. వీటి విలువ ఏకంగా 4,240 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ముందుగా ప్రభుత్వం అసైన్డ్‌ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను 2015, జనవరి 1న జీఓ–1తో భయపెట్టారు. తర్వాత ఎకరానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు భూ యాజమానులకు ఇచ్చి వారి నుంచి భూములను చంద్రబాబు, అతని అనుచరులు లాక్కున్నట్లు సమాచారం.

Also Read: వెంకటగిరిలో బాబు.. విజయవాడలో జగన్.. ప్రజా మద్దతు తేలిపోయిందా?

అసైన్డ్‌ భూములను కూడా 6 కేటగిరీల కింద విభజించి భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. కనీసం కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండా ఈ జీఓను తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ విషయంలో ఏకంగా కోర్టును కూడా మోసంచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చట్ట ప్రకారం.. 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు గానీ చేయకూడదు. కాబట్టి అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్‌ భూముల రికార్డులను మాయం చేశారని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అనంతరం 1954 కు సంబంధించిన భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు.

Also Read: లండన్ లో సీఎం రేవంత్ టూర్.. బీఆర్ఎస్ కు సవాల్

అప్పటికే అసైన్డ్‌ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం కేబినెట్‌ ఆమోదం లేకుండానే జీఓ-41 ను జారీ చేశారు. ఎవరి ఆధీనంలోనూ లేని 328 ఎకరాల ప్రభుత్వ భూములు తమ బినామీలు 522 మంది ఆధీనంలో ఉన్నట్లుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేశారు. తద్వారా 760.25 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. మొత్తం భూసమీకరణ ప్యాకేజీ కింద 5 వేల కోట్ల భూములు కొల్లగొట్టారని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button