తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth Reddy: లండన్ లో సీఎం రేవంత్ టూర్.. బీఆర్ఎస్ కు సవాల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఎన్ఆర్ఐలతో సీఎం ముచ్చటించారు. వచ్చే లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు.

Also read: Congress: తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: మంత్రి వెంకట్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్ ను బొందపెట్టారని.. ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల సమాధి తవ్వి అందులో కారు గుర్తును పాతిపెడతామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జనవరి 26న నుంచి రాష్ర్టవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు నిర్ణయించినట్టు సీఎం వివరించారు. టైగర్ (కేసీఆర్) రెస్ట్ తీసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. అయితే తాము కూడా పట్టుకోవడానికి ఎముకలు, వలలతో తాము కూడా ఎదురు చూస్తున్నామన్నారు.

ఎన్నికల సమయంలోనే తాను రాజకీయాలు చేస్తానని.. కానీ పాలనలో అందరినీ కలుపుకుపోతానని, తాను రైతు బిడ్డనేనని గుర్తుచేశారు.హైదరాబాద్ నగరంలోని మూసీ నదిని రాబోయే 36 నెలల్లో థేమ్స్ నదిలాగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇకపోతే హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టాలని.. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో కాకుండా.. ప్రపంచస్థాయి నగరాలతో భాగ్యనగరం పోటీ పడుతోందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button