తెలుగు
te తెలుగు en English
జాతీయం

Electoral Bond: ఎలక్టోరల్ బాండ్లలో బయటపడ్డ బీజేపీ అవినీతి!

ఇన్ని రోజులుగా తమ ప్రభుత్వానికి అవినీతి మరకే లేదని, గత పదేళ్లుగా అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని గొప్పలు చెబుతూ వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతి బండారం బయటపడింది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌‌కు చెందిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది.

ఒక్క బీజేపీకే 46.7 శాతం

దీని ప్రకారం మొత్తంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ ఎన్నికల బాండ్ల రూపంలో రూ.12,999 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో అందాయి. వీటిలో 46.7 శాతం… అంటే దాదాపుగా సగం అధికార బీజేపీ ఖాతాలోకే వచ్చాయి. రూ.6,060 కోట్ల విలువైన బాండ్లు బీజేపీ ఖాతాలోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ యాజమాన్యంలోని ఫ్యూచర్ గేమింగ్ మరియు హోటల్ సర్వీసెస్ (₹1,368 కోట్లు) అత్యధిక విరాళాలు అందించిన కంపెనీలలో ఉన్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (రూ. 966 కోట్లు); క్విక్ సప్లై చైన్ (రూ.410 కోట్లు); వేదాంత (రూ. 400 కోట్లు), హల్దియా ఎనర్జీ (రూ. 377 కోట్లు). గ్రాసిమ్ లిమిటెడ్ , జిందాల్ స్టీల్ అండ్ పవర్, డీఎల్ఎఫ్, డాక్టర్ రెడ్డీస్ కూడా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశారు. భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ ₹247 కోట్లు విరాళంగా ఇచ్చింది. అయితే ఈ సంస్థలన్నీ కూడా కేంద్రంలోని బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ: వైసీపీలో చేరిన ముద్రగడ.. జగన్ గెలిచేందుకు కృషి చేస్తా!

కాంగ్రెస్, వామపక్షాల ఆరోపణలకు మరింత బలం..

అంతేకాదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు కంపెనీల నుంచి అత్యధిక ధరలకు వ్యాక్సిన్లను కొనుగోలు చేసి ఆ సంస్థకు భారీగా లబ్ధిని చేకూర్చిందని కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్షాలు పలు సందర్భాల్లో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసిన బాండ్ల వివరాల్లో భారత్ బయోటెక్, రెడ్డీస్ లేబొరేటరీస్ వంటి సంస్థల పేర్లు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో కొవాక్సిన్‌ను రూపొందించిన భారత్ బయోటెక్ నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాక్సిన్లను అత్యధిక ధరకు చెల్లించి కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

ALSO READ: రేపు మధ్యాహ్నం షెడ్యూల్!

2018 నుంచి నేటి దాకా కమలం పార్టీకే లబ్ధి..

బీజేపీ ప్రభుత్వం 2018లో రాజకీయ పార్టీలకు నిధులు సమాకూర్చుకునేందుకు ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బాండ్లను దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జారీ చేస్తుంది. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టిన నాటి నుంచి నేటి వరకు బీజేపీ భారీగా లబ్ధిపొందినట్లు తాజా పరిణామాలు మరోసారి స్పష్టంచేశాయి. నేడో, రేపో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల అంశం తమ ప్రభుత్వానికి అశనిపాతంలా తాకిందని కమలం పార్టీ నేతలు సైతం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ బాండ్ల అంశం బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button