తెలుగు
te తెలుగు en English
క్రికెట్

MS Dhoni: చెన్నైలో ఎంఎస్ ధోనీ ‘తలా దర్శనం’.. వీడియో వైరల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ మార్చి 22న ఆరంభం కానుంది. అయితే మ్యాచ్‌లకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని జట్ల క్రీడాకారులు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తాజాగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెన్నైలో అడుగుపెట్టాడు.

ALSO READ: ఇండియ‌న్ వెల్స్‌లో బోణీ కొట్టిన సుమిత్ న‌గాల్

సూపర్ ఎంట్రీ

‘తాలా’ ఎంఎస్ ధోనీ కారు నుంచి దిగుతూ సూపర్ ఎంట్రీ ఇచ్చాడు. కారులో వచ్చిన ఆయన హోటల్‌ లోపలికి వెళ్లాడు. ఈ మేరకు సీఎస్‌కే ఫ్రాంఛైజీ.. ‘తలా దర్శనం’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, మార్చి 1న చేనై రావాల్సిన ఆయన.. జామ్‌నగర్‌లో అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button