తెలుగు
te తెలుగు en English
మరిన్ని

MOIS: వాహనదారులకు శుభవార్త.. యాక్సిడెంట్లే ఉండవు ఇక

ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా.. నిబంధనలు (Rules) పెట్టినా రోడ్డు ప్రమాదాలు (Road Accidents) మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ప్రయాణికులు, వాహనదారుల రక్షణ కోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిత్యం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మరో కొత్త ఆలోచన చేసింది. అసలు ప్రమాదాలు జరగకుండా ముందే నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అతి సమీపానికి వ్యక్తులు, వాహనాలు (Vehicles) వస్తే డ్రైవర్ ను వాహనం అప్రమత్తం చేసేలా ఓ వ్యవస్థను అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు కొత్త విధానాన్ని త్వరలో అమలు చేయాలని భావిస్తోంది. ఆ విధానం ఏమిటి? ఎలా పని చేస్తుందో తెలుసుకోండి.

Also Read అసెంబ్లీ బరిలో క్రికెటర్లు! గ్రౌండ్ లో సక్సెస్.. మరి ఎన్నికల్లో?

రోడ్డుపై వాహనదారులు, పాదచారులు వెళ్తున్న సమయంలో వాహనదారులను అప్రమత్తం చేసేలా మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (Moving of Information System-MOIS) పని చేస్తుంది. ఈ వ్యవస్థను వాహనాల్లో ఏర్పాటుచేస్తారు. రోడ్డుపై ఎవరైనా పాదచారులు, ఇతర వాహనాలు సమీపానికి వస్తే వెంటనే వాహనంలోని డ్రైవర్ (Driver)కు ఆ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అప్రమత్తం చేసే సిగ్నల్ (Signal)ను కొలిషన్ వార్నింగ్ సిగ్నల్ అని అంటారు. సిగ్నల్ రావడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నెమ్మదిగా పోనివ్వడం లేదా బ్రేక్ వేయడం వంటివి చేస్తాడు. దీంతో అసలు ప్రమాదం అనేదే సంభవించదు. MOIS విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and Highways) ఆశిస్తోంది.

Also Read కేసీఆర్ ఓటమి పక్కానా? బిడ్డకు పట్టిన గతి తండ్రికి కూడానా?

ఈ వ్యవస్థను ప్రయాణికులు (Passengers), వాణిజ్య వాహనాల్లో మొదట తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుపై వాహన కంపెనీలు, ఇతర వర్గాలతో చర్చించే అవకాశం ఉంది. అన్ని కుదిరితే వాహనాలు తయారయ్యే సమయంలోనే ఇన్ బిల్ట్ (Inbuilt)గా MOIS వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. అంటే కొత్త వాహనాల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అయితే MOIS వ్యవస్థ అందుబాటులోకి రావడానికి ఆరు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైతేనేం రోడ్డు ప్రమాదాలను తగ్గించే మంచి ఉపాయం చేశారు. దానివలన కొన్ని ప్రాణాలైనా (Lives) కాపాడే అవకాశం ఉండడం హర్షించదగ్గ విషయంమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button