తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Pakistan: భారత్ పురోగమిస్తుంటే… పాకిస్థాన్ అడుక్కతింటోందన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

మనమంటే ఇష్టంలేని వారు మనల్ని పొగిడితే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇప్పుడు భారత్ పరిస్థితి అలాగే ఉంది. మన దేశాన్ని ఆక్రమించాలని చూస్తు సరిహద్దుల వద్ద పనిచేస్తున్న ఎందరో జవాన్లను పాకిస్తాన్ పొట్టనపెట్టుకుంది.అలాంటి పాకిస్థాన్ …మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ ను పొడిగారు. తన దేశమైన పాకిస్తాన్ పై నిప్పులు చేరిగారు.

అనేక కేసులు ఎదుర్కొంటూ, అనారోగ్య కారణాలు చెప్పి దేశం విడిచి వెళ్లిపోయాడు పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.ప్రస్తుతం లండన్ లో ఉంటున్నాడు. ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ పురోగమిస్తుంటే, పాకిస్థాన్ అంతకంతకు దిగజారుతోందన్నారు. భారత్ అభివృద్ది పథంలో దూసుకెళుతూ చందమామను చేరుకుందని, కానీ, పాకిస్థాన్ దయనీయస్థితిలో ప్రపంచ దేశాల ముందు చిల్లర పైసల కోసం అడుక్కుతింటోందని ఘాటుగా స్పందించారు. భారత్ చేయగలిగింది పాకిస్థాన్ ఎందుకు చేయలేకపోతోంది? ఈ దారుణ పరిస్థితులకు ఎవరు బాధ్యులు?” అని సూటిగా ప్రశ్నించారు.

భారత్ జీ20 సదస్సు నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిష్ఠను మరింత పెంచుకుందని వివరించారు. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభానికి మాజీ సైనిక జనరళ్లు, న్యాయమూర్తులే కారణమని షరీఫ్ ఆరోపించారు. లాహోర్ లోని పార్టీ కార్యకర్తలతో నవాజ్ షరీఫ్ లండన్ నుంచి వీడియో లింక్ ద్వారా సమావేశమయ్యారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాని అయినప్పుడు భారత్ వద్ద 8,332 కోట్లు మాత్రమే ఉన్నాయని…. ఇప్పడు భారత్ వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యం విలువ 49 లక్షల కోట్లు అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button