తెలుగు
te తెలుగు en English
జాతీయం

Bharatratna: మాజీ ప్రధాని పీవీకి భారతరత్న.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డ్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. శుక్రవారం పీవీతోపాటు మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భరతరత్న పురస్కారం ప్రకటించింది. భారతరత్న అవార్డు వరించిన తొలి తెలుగు వ్యక్తికిగా పీవీ నరసింహరావు నిలిచారు. ఈ సారి మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించింది.

Also read: Minister Roja: వైఎస్ షర్మిలపై రోజా కామెంట్స్.. ఏ మొహంతో కాంగ్రెస్ లో చేరారని ప్రశ్న

పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 1991 నుంచి 1996 వరకు భారత దేశ ప్రధానమంత్రిగా చేసిన తొలి తెలుగు, తెలంగాణ వ్యక్తి. 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు.. రాజనీతిలో ఆరితేరారు. భారత్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు.. భారతదేశ ఆర్థిక, వ్యాపార స్వరూపాన్ని మార్చేశారు. సరళమైన ప్రపంచీకరణ వైపు భారతదేశాన్ని తీసుకెళ్లిన మహానుభావుడు పీవీ నరసింహారావు. ఇతర దేశాల్లో వాణిజ్య, వ్యాపారాలను విస్తృతం చేసి.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచీకరణ వైపు తిప్పిన మేధావి పీవీ నరసింహారావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button