తెలుగు
te తెలుగు en English
జాతీయం

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిన్న రెండు గంటల విచారణ అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. అరవింద్ కేజ్రీవాల్‌ను కక్షపూరితంగా, కావాలనే అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ALSO READ: బీజేపీ షాక్.. వికసిత్ భారత్ సందేశాలపై ఈసీ సీరియస్

మరోవైపు, కేజ్రీవాల్ తరుఫున న్యాయవాదులు నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అధికారుల బలవంతపు చర్య నుంచి రక్షణ కల్పించాలని.. ఇందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని, అత్యవసర పిటిషన్‌పై ధర్మాసనం స్పందించాలని కోరారు. ఇవాళ ఈ కేసుపై విచారణ జరగనుంది. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

2 Comments

  1. Hey there I am so glad I found your webpage, I really found you by error, while I was looking on Google for something else, Nonetheless I am here now and would just
    like to say kudos for a marvelous post and a all round entertaining blog (I also love the theme/design), I don’t
    have time to read through it all at the moment but I have bookmarked it and also included your RSS feeds, so when I have time I will be back to read more, Please
    do keep up the great job.

    Have a look at my homepage; vpn 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button