తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Ravanth Reddy: ముగిసిన విదేశీ పర్యటన.. రేపు హైదరాబాద్‌కు రాక!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. మొదట దావోస్ వార్షిక సమ్మిట్‌లో రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు వివిధ దేశాల వ్యాపారవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నారు. ఇందుకోసం ఆయా దేశ, విదేశీ కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం పలు అగ్రిమెంట్లు కూడా చేసుకుంది. అయితే గతేడాది సమ్మిట్‌లో రూ.19,900 కోట్లు మాత్రమే వస్తే ఈ సారి రెండింతల పెట్టుబడులు వచ్చాయి. ఈ క్రమంలో రేపు ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి బృందం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అయితే ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు బయలుదేరే ముందు ఆదివారం అర్థరాత్రి (దుబాయ్‌లో పని దినం) వరకు సంప్రదింపులు కొనసాగనున్నాయి.

ALSO READ: అస్సాంలో రాహుల్ జోడో న్యాయ్ యాత్ర… బీజేపీ కార్యకర్తల దాడి

రైతుల పక్షాన నిలబడాలి..

దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్‌లలో మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత దావోస్ నుంచి లండన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రపంచ ప్రసిద్ధ, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక భవనాలు, స్మారక చిహ్నాలను సందర్శించారు. అనంతరం లండన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button