తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

NRI: సీఎం కేసీఆర్ పై అభిమానం.. లండన్ వీధుల్లో యువకుడి అద్భుతం

సీఎం కేసీఆర్ పై అభిమానంతో తెలంగాణకు చెందిన ఓ యువకుడు అద్భుతం చేశాడు. తెలంగాణ సైకిలిస్ట్‌ బీరం మల్లారెడ్డి అనే యువకుడు కేసీఆర్ ముఖ చిత్రాన్ని లండన్‌ నగరంలో వినూత్నంగా చిత్రీకరించాడు. అందుకు లండన్‌ వీధుల్లో 6 గంటల కంటే తక్కువ సమయంలో సుమారు 88 కిలోమీటర్లు సైకిల్‌పై చక్కర్లు కొట్టాడు.

Also read: Congress: ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఆకట్టుకుంటున్న అగ్రనేతలు

అయితే ఆ యువకుడు ప్రయాణించిన రోడ్డు మార్గాలన్నింటినీ జీపీఎస్ ద్వారా రికార్డ్ చేశాడు. అవి అన్నీ కలిపితే సీఎం కేసీఆర్‌ ముఖ చిత్రం వచ్చింది. కేసీఆర్‌ రైడ్‌ పేరిట అతను రోడ్లపై సైకిల్‌ తొక్కుతున్న సమయంలో గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ వినియోగించాడు. అందుకు ముందుగా సెలక్ట్‌ చేసుకున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ సైకిల్‌ తొక్కాడు. అంతా పూర్తయిన తర్వాత అతను ప్రయాణించిన మార్గాన్ని గూగుల్‌ మ్యాపింగ్‌ చేశాడు. ఇలా అన్ని మార్గాలను కలుపగా అచ్చంగా కేసీఆర్‌ స్కెచ్‌ వచ్చింది. కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని మల్లారెడ్డి ఇలా వినూత్నంగా చాటడం ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో బీఆర్ఎస్ అఫిషియల్ ఎక్స్ అకౌంట్ లో షేర చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button