తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

ORR Road Accident: BRS ఎమ్మెల్యే కారు ప్రమాదం.. వెలుగులోకి కీలక విషయాలు!

ఫిబ్రవరి 23న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై జరిగిన కారు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి విషయంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా మరికొన్ని విషయాలు వెల్లడించారు. లాస్య ప్రయాణిస్తున్న కారు ముందుగా టిప్పర్‌ను ఢీకొని ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ALSO READ: రసకందాయంలో హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు.. కోర్టు మెట్లెక్కిన రెబల్ ఎమ్మెల్యేలు

ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా ఆ టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా టిప్పర్‌.. కారును ఢీకొందా? లేదా కారు టిప్పర్‌ను వెనక నుంచి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు. లాస్య పీఏ ఆకాశ్ నిద్రమత్తు కారణంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button