తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Hamza Shaikh: అనూహ్యరీతిలో ఇంగ్లండ్ బ్యాటర్ ఔట్… వీడియో వైరల్

అండ‌ర్ -19 ప్ర‌పంచ క‌ప్‌లో ఇంగ్లండ్ ఆట‌గాడు అనూహ్య‌రీతిలో ఔట‌య్యాడు. ఫీల్డింగ్ జ‌ట్టు వికెట్ కీప‌ర్‌కు సాయం చేయ‌బోయిన‌ హ‌మ్జా షేక్‌ నిరాశ‌గా పెవిలియ‌న్ చేరాడు. సూప‌ర్ సిక్స్ స్టేజ్‌లో భాగంగా జింబాబ్వే, ఇంగ్లండ్ త‌ల‌ప‌డ్డాయి. రియాన్ సింబీ వేసిన 17వ ఓవ‌ర్‌లో హ‌మ్జా బంతిని డిఫెన్స్ చేశాడు. ఆ బంతి వికెట్ల‌కు ద‌గ్గ‌ర ప‌డింది. స్టంప్స్ వెన‌కాల ఉన్న‌ రియాన్ క‌మ్‌వెంబా బంతిని తీసుకునేందుకు వ‌స్తుండ‌గానే హ‌మ్జా చేత్తో బంతిని ప‌ట్టుకొని అతడికి ఇచ్చాడు.

Also Read: గిల్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశ‌గా భారత్

అది చూసిన బౌల‌ర్ అప్పీల్ చేశాడు. దాంతో, ఫీల్డింగ్‌కు అంత‌రాయం క‌లిగించాడ‌నే నెపంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్, థ‌ర్డ్ అంపైర్‌లు హ‌మ్జాను ఔట్‌గా ప్ర‌క‌టించాడు. ఊహించ‌ని ప‌రిణామంతో, హ‌మ్జా ఒక్క‌సారిగా షాక‌య్యాడు. ఆ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button