తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Newzealand: స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వేకు కరోనా.. మ్యాచ్‌కు దూరం

న్యూజిలాండ్ క్రికెట్‌లో క‌రోనా వైరస్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కరోనా బారిన పడగా.. తాజాగా స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వేకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనను వెంట‌నే మేనేజ్‌మెంట్ కాన్వేను ఐసోలేష‌న్‌కు తరలించారు. అతడిని కలిసిన వారితోపాటు దగ్గరగా కాంటాక్ట్ ఉన్న క్రీడాకారులు జాగ్రత్తలు తీసుకోవాలని న్యూజిలాండ్ బోర్డు హెచ్చరించింది.

ALSO READ:  పాక్ వికెట్ కీపర్ అజం ఖాన్‌‌కు అవమానం.. కివీస్‌పై ఫ్యాన్స్‌ ఫైర్

పాకిస్తాన్‌ మ్యాచ్‌కు దూరం..

పాకిస్తాన్‌తో జ‌రిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు కాన్వే దూరమయ్యారు. దీంతో ఆయన స్థానంలో చాడ్ బోవెస్‌ను ఎంపిక చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ 3-0 తో ఆధిక్యంలో ఉంది. శుక్రవారం క్రిస్ట్‌చ‌ర్చ్‌లోని హ‌గ్లే ఓవ‌ల్ స్టేడియంలో నాలుగో టీ20 జ‌రగ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button