తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: గుంటూరు కారం

Pakka Telugu Rating : 2.75/5
Cast : మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, జయరామ్, ఈశ్వరిరావు, జగపతి బాబు, రావు రమేశ్ తదితరులు
Director : త్రివిక్రమ్ శ్రీనివాస్
Music Director : ఎస్ థమన్
Release Date : 12/01/2024

సంక్రాంతి బరిలోకి ఎన్నో అంచనాలతో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న మహేశ్ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు వేసుకున్నారు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. శ్రీలీల అందం మహేశ్ బాబు గ్లామర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేశ్ చేసిన భావోద్వేగ పూరిత మాటలు ప్రతి ప్రేక్షకుడిని కదిలించాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. అతడు, ఖలేజా వంటి సినిమాలతో మహేశ్ రేంజ్ ను పెంచిన త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’తో కూడా అదే స్థాయిలో సినిమా ఉందా లేదా అనేది చూద్దాం.

Also Read మూవీ రివ్యూ: హను-మాన్

కథ: రాజకీయ గొడవల కారణంగా గుంటూరులోని వైరా వసుంధర (రమ్యకృష్ణ), రాయల్ సత్యం (జయరామ్) దంపతులు విడిపోతారు. వీరి కుమారుడు వీర వెంకటరమణ ఉరఫ్ రమణ (మహేశ్ బాబు) తన మేనత్త బుజ్జి (ఈశ్వరి రావు) వద్ద పెరుగుతూ మిర్చి వ్యాపారం నిర్వహిస్తుంటాడు. తల్లి వసుంధర తన తండ్రి, రాజకీయవేత్త అయిన వైరా వెంకటస్వామి (ప్రకాశ్ రాజ్) వద్ద ఉండి రాజకీయంగా రాణిస్తుంది. అయితే అకస్మాత్తుగా 25 ఏళ్ల తర్వాత తాత వెంకటస్వామి మనవడు అయిన రమణను హైదరాబాద్ పిలిపించుకుంటాడు. ఓ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. తల్లిబిడ్డలు ఎందుకు దూరమయ్యారు? చివరకు కలిశారా అనేది మిగతా కథ. ఈ మధ్యలో ఆముక్త మాల్యద ఎందుకు వచ్చింది? ఆమె పాత్ర ఏమిటనేది సినిమా చూడాల్సిందే.

Also Read మూవీ రివ్యూ: డెవిల్

కథనం: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే అందంగా.. హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. పెద్దగా మెదడుకు పని పెట్టే సినిమాలు ఏం కావు. మళ్లీ అలాంటి కథనే త్రివిక్రమ్ ఎంచుకున్నారు. కథపరంగా చూస్తే పాత కథనే అనిపిస్తుంది. తెలిసిన కథనే మరోసారి కొత్తగా అందంగా తెరకెక్కించాడు. తల్లికొడుకుల అనుబంధాన్ని రాజకీయాలకు జోడించి త్రివిక్రమ్ కథ రాసుకున్నాడు. సినిమా మొదలుకాగానే కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం.. కొంత లవ్ ట్రాక్ నడిపించాడు. హైదరాబాద్, గుంటూరు రావడంతోనే విరామం వచ్చేస్తుంది. తల్లి కొట్టిన దెబ్బతో సెకండాఫ్ లోకి ప్రవేశిస్తాం. ఈ సెకండాఫ్ లో కూడా తాత మనవడి మధ్య పోరు కొనసాగుతుంది. చివరకు తల్లీకొడుకు ఎలా కలిశారనేది మిగతా కథాంశం.

కథలో అసలు విషయం కన్నా వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సంక్రాంతి పండుగ కదా ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తున్నారనే కోణంలో త్రివిక్రమ్ సినిమాను నడిపించాడు. అయితే సినిమాలో ప్రధానంగా సాగదీత కనిపించింది. ఫస్టాఫ్, సెకండాఫ్ రెండింటిలోనూ చాలా సీన్లు అనవసరంగా కనిపించాయి. మిర్చి యార్డులో శ్రీలీల, మహేశ్ డ్యాన్స్ లు హైలెట్ గా నిలిచాయి. గుంటూరు కారం అంటే గుంటూరు నేపథ్యంగా ఏమైనా కథ ఉంటుందా అని అనుకుంటే.. కేవలం గుంటూరులోనే ఉంటున్న కారణంగా ఆ పేరు పెట్టారని తెలిసింది. క్లైమాక్స్ లో కథ ముగింపు రుచించలేదు. ఫస్టాఫ్ లో ఒక్కోసారి ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మాదిరి మహేశ్ గుంటూరు-హైదరాబాద్ కు రావడమే ఉంటుంది. తల్లీకొడుకుల అనుబంధం ఇతివృత్తంగా తీసుకున్నా అనుకున్నంత స్థాయిలో ఆ మమ‘కారం’ పండలేదు. రాసుకున్న కథ.. తెరపై వచ్చిన సినిమా వేరుగా ఉందని తెలుస్తోంది.

ఎవరెలా నటించారంటే..
మహేశ్ బాబు సినిమాలు చూడాలంటే థియేటర్లనే చూడాలి. అంతే అందంగాను మహేశ్ సినిమాలో సినిమాలో కనిపించాడు. సినిమా ఆద్యంతం వినోదం పండిస్తూ రమణ పాత్రలో మహేశ్ నటించాడు. నటనపరంగా మహేశ్ చింపేశాడు. శ్రీలీల పాత్ర కేవలం అందాల ఆరబోతకు పరిమితమైంది. అప్పుడప్పుడు ఆమె పాత్ర సినిమాలో అవసరమా అనిపిస్తుంటుంది. కానీ మహేశ్, శ్రీలీల డ్యాన్స్ లు మాత్రం మామూలుగా లేవు. అసలు మహేశ్ నుంచి ఆ డ్యాన్స్ లు ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. రమ్యకృష్ణ పాత్ర చిన్నదే అయినా తన పరిధిలో నటించింది. తాత పాత్రలో ప్రకాశ్ రాజ్ పాత్ర కొంత అతిగా కనిపించినా పర్లేదు. జగపతిబాబు పాత్ర ఎందుకు ఉందో అర్ధం కాదు. ఇక రావు రమేశ్, సుబ్బరాజు పాత్రలు ఉన్నా లేనట్టే. తన స్నేహితుడైన సునీల్ ను త్రివిక్రమ్ కావాలని సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినట్లు కనిపిస్తుంది. వెన్నెల కిశోర్ తో నవ్వించే ప్రయత్నం చేసినా.. మహేశ్ బాబే కామెడీని తన భుజాలకెత్తుకున్నాడు.

సాంకేతిక వర్గం
సినిమా నిర్మాణం ఉన్నతంగా ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో ఉన్నట్టే పెద్ద ఇల్లు పరంపర కొనసాగింది. ఆ ఇంట్లోనే ప్రధాన సీన్లు ఉన్నాయి. స్క్రీన్ మొత్తం మహేశ్ బాబే కనిపించాడు. ఏ ఫ్రేమ్ లో చూసినా మహీనే అందంగా కనిపిస్తాడు. ఫస్టాఫ్ లో రెండు పాటలు, సెకండాఫ్ లో ఒక పాటనే ఉన్నాయి. కానీ కుర్చీ మడతపెట్టి పాట మాత్రం సినిమాకు ప్రధాన బలం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు పెట్టింది పేరైనా ఎస్ థమన్ కొంత నిరాశపరిచాడు. సినిమాకు తగ్గట్టు బీజీఎం ఇవ్వలేదని మహేశ్ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. కొరియోగ్రఫీ విషయంలో శేఖర్ మాస్టర్ వందకు 200 శాతం న్యాయం చేశాడు. మహేశ్, శ్రీలీలతో ఊర మాస్ స్టెప్పులు వేయించాడు. గతంలో మహేశ్ నుంచి ఆ స్థాయిలో డ్యాన్స్ చూసి ఉండరు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా కోసం ఎక్కడా భారీ సెట్లు వేసినట్లు.. కొత్త ప్రదేశాలకు వెళ్లనట్టు కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్ లోనే సినిమా పూర్తి చేసినట్టు ఉంది. మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ స్థాయి డైలాగ్ లు ఈ సినిమాలో కొరవడ్డాయి. ‘కొడుకును వదులుకోవాలంటే తల్లి చచ్చిపోవాల్సిందే’ అనే ఒక డైలాగ్ కొంత ఉద్వేగానికి లోను చేస్తుంది.

ప్లస్ పాయింట్లు
– మహేశ్ గ్లామర్
– అక్కడక్కడ వినోదం
– డ్యాన్స్ లు

మైనస్ పాయింట్లు
– కథ, కథనం
– సాగదీత

పంచ్ లైన్: ఘాటు లేని ‘గుంటూరు కారం’

7 Comments

  1. It is appropriate time to make some plans for the future and it’s time to be happy.
    I have read this post and if I could I want to suggest
    you some interesting things or advice. Perhaps you could write
    next articles referring to this article. I desire to read even more things
    about it!

    My page: vpn coupon 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button