తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ఈగల్

Pakka Telugu Rating : 2.25/5
Cast : రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు
Director : కార్తీక్ గట్టమనేని
Music Director : డేవ్ జాండ్
Release Date : 09/02/2024

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

దేశ రాజధాని ఢిల్లీలో ఓ నేషనల్ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేసే నళిని(అనుపమ పరమేశ్వరన్) ఓ వీధిలో షాపింగ్ చేస్తుండగా.. అక్కడ ఓ క్లాత్ తీసుకుంటుంది. దీనికి అక్కడ ఉన్నవారు ఇది చాలా అరుదుగా దొరికే కాటన్‌తో తయారుచేసిన క్లాత్ అని, తలకోనలో ఈ పత్తిని పండించే వ్యక్తి ప్రస్తుతం కనిపించడం లేదని చెబుతారు. ఈ అరుదైన పత్తిపై తాను పనిచేసే పత్రికలో ప్రచురితం చేయడంతో సీబీఐ రంగంలోకి దిగి పత్రికను అడ్డుకుంటుంది. దీంతో నళిని సస్పెండ్ చేయడం.. ఈ చిన్న వార్తకు అందరూ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారోనని నళినికి ఆలోచన రావడంతో కథ మొదలవుతోంది. పత్తిని పండించే సహదేవ్ వర్మ ఎందుకు కనబడడం లేదు? ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి నళిని ఎందుకు వెళ్తుంది? అక్కడ ఆమె ఏం తెలుసుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

క‌థ‌నం-విశ్లేషణ:

అక్రమ ఆయుధాల కట్టడికి హీరో చేసే పోరాటమే ‘ఈగల్’. అయితే ఈ కథకు ఒక మంచి సందేశం జోడించి దానిని యాక్షన్ సినిమాలా చెప్పేలా డైరెక్టర్ సాహసం చేశారు. ఇందులో సినిమా ఫస్ట్ ఆఫ్‌లో నళిని ఓ జర్నలిస్ట్‌గా తలకోనకు వచ్చి కొండ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా సహదేవ్ వర్మ(రవితేజ)పై హీరోయిజం చూపించే ఎలివేషన్స్‌ మొదలవుతాయి. ఇలా భిన్నంగా సినిమా చివరి వరకు అతని క్యారెక్టర్‌ని ప్రేక్షకులకు పరిచయం చేయడంతోనే సరిపోతోంది. ఇక్కడ ప్రేక్షకుల సహనం పరీక్షించినట్లు అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా గందరగోళంగా మారింది. సెకండ్ హాఫ్‌లో సహదేవ్ వర్మ(రవితేజ) తెలుస్తోంది. కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసే అతని వెనక ఓ ప్రేమకథ మొదలై ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్తోంది. అనుకోకుండా టెర్రరిస్ట్ దాడిలో ఆమె దూరం కావడంతోపాటు వీరికి ప్రేమకు సహాయం చేసే ఓ పాప కూడా దూరం కావడం కంటతడి పెట్టిస్తోంది. ఈ సంఘటనతో ఆమె ఇచ్చిన ఓ మెసేజ్ ఆధారంగా అక్రమ ఆయుధాలు అరికట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఒక కోట నిర్మించుకొని దేశ వ్యాప్తంగా జరిగే అక్రమ ఆయుధాలను నవదీప్ సహాయంతో దొంగిలిస్తూ ఉంటాడు. ఇలా గన్స్ సేకరించి డిజైన్ చేయడం కేజీఎఫ్ సినిమాను అనుసరించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఆయుధాలు చూపించి నగదు దోచుకోవడంతోపాటు హత్యలకు దారి తీస్తున్న సంఘటనల ఆధారంగా దర్శకుడు తీయడం ఆసక్తికరంగా ఉంది. అయితే కొండ మీద ఫామ్ హౌస్, కాటన్ ఫ్యాక్టరీని నడిపే హీరో వ్యవహారం, ‘రా’ వాళ్లు చేసే ఆపరేషన్‌పై ఆసక్తి అంతంతమాత్రమే. ఇంకా ఎమ్మెల్యే పాత్రలో అజయ్ ఘోష్‌ ద్వారా కామెడీ పండించాలని అనుకున్న వర్కౌట్ కాలేదు. లవ్ స్టోరీ విషయానికొస్తే రవితేజ, కావ్య థాపర్ మధ్య సన్నివేశాలు కొత్తగా ఉండడంతో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక చివరిలో ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. ఓవరాల్‌గా ఫస్ట్ ఆప్ ఎలివేషన్ సీన్స్ కాస్త బోర్ కొట్టిన.. సెకండాఫ్ చాలా థ్రిల్లింగ్‌గా, క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది.

న‌టీ-న‌టులు:

రవితేజ డిఫరెంట్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. సహదేవ్ పాత్రలో గడ్డం, లుంగీతో అదరగొట్టాడు. అయితే రవితేజ కామెడీ, చలాకీతనం ఇందులో కనిపించవు. అనుపమ పరమేశ్వర పాత్ర ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తన పాత్రకు న్యాయం చేసింది. కావ్య థాపర్ తన అందంతో ఆకట్టుకుంది. నవదీప్‌కి కూడా చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దొరికింది. వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల వాళ్ల పాత్ర పరిధి మేరకు చక్కగా చేశారు. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీ, మిర్చి కిరణ్‌ మధ్య కామెడీ ట్రాక్ కొంత ఆకట్టుకుంటుంది.

సాంకేతిక వర్గం:

‘ఈగల్’ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, క్వాలిటీ బాగుంది. సంగీత దర్శకుడు డేవ్ జాండ్ భిన్నంగా ట్రై చేశాడు. సాంగ్స్ అంతంతమాత్రమే. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో మెసేజ్ బాగున్నా.. అక్కడక్కడ బోరింగ్ తెప్పించేలా సీన్స్ రావడం, ఎలివేషన్స్‌పైనే డైరెక్టర్ ఫోకస్ పెట్టడం మైనస్ అని చెప్పాలి. కాస్టింగ్.. ప్రొడక్షన్, యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా డిజైన్ చేసిన స్టైలిష్‌గా కనిపించింది.

ప్లస్ పాయింట్స్:

రవితేజ నటన

యాక్షన్ సీన్స్

డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

కథ, కథనం

ఫస్ట్ ఆప్‌లో సాగదీత

ఎలివేషన్స్

బోరింగ్ సన్నివేశాలు

పంచ్‌లైన్: రవితేజ ఫ్యాన్స్‌కు స్టైలిష్ యాక్షన్ ఎంటైర్‌టైనర్

7 Comments

  1. I’m curious to find out what blog system you have been using?
    I’m having some small security problems with my latest site and
    I’d like to find something more secure. Do you have any recommendations?

    My blog: vpn code 2024

  2. It is in reality a great and helpful piece of information.
    I am happy that you shared this helpful information with us.
    Please keep us informed like this. Thanks for sharing.

    my blog post – vpn 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button