తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ఊరు పేరు భైరవకోన

Pakka Telugu Rating : 2.25/5
Cast : సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, రవిశంకర్, బ్రహ్మాజీ, వడివుక్కరసి తదితరులు
Director : విఐ ఆనంద్
Music Director : శేఖర్ చంద్ర
Release Date : 16/02/2024

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు మూవీలో హిట్టు కొట్టిన సందీప్ కిషన్ చాలా ఏళ్లుగా అలాంటి మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అడపాదడపా సినిమాలు తీస్తున్న అవి సందీప్ కు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికిపోతావు చిన్నోడా సినిమాతో హిట్టు కొట్టిన డైరెక్టర్ వీఐ ఆనంద్ తో నటించిన ఊరు పేరు భైరవకోన చిత్రంలోని పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతోనైనా సందీప్ కిషన్ హిట్టుకొట్టాడా. అసలు ఊరు పేరు భైరవకోన మూవీ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

భైరవకోనలో మారుమూల అటవీ ప్రాంతం నుంచి తప్పించుకోవాలని చూసిన వ్యక్తికి వడివుక్కరసి (పెద్దమ్మ) అతనికి గండబేరుండ శిక్షను అమలు చేస్తుంది. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. కథ ప్రారంభంలోనే నగలు కొట్టేసిన దొంగగా సందీప్ కిషన్ (బసవ) తెరముందు ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ నగలను తీసుకుని వైవా హర్ష (జాన్) తో కలిసి కారులో వెళ్తుండగా.. బసవ బాబాయి ఫోన్ చేసి వర్ష బొల్లమ్మ (భూమి) ప్రస్తావన తెస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో భూమి పరిచయం, రౌడీలు తనను ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసుకుంటాడు. భూమిపై ప్రేమ పెంచుకుంటాడు. మళ్లీ మెళకువలోకి వస్తాడు.

ఆ తర్వాత కారులో పారిపోతూ దొంగ అయిన కావ్య థాపర్ (గీత) దారిలో ప్రమాదంలో గాయపడినట్టు కనపడడం.. ఆమెను కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్తారు. మధ్యలో పోలీసులకు పట్టుబడడంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలో భైరవకోనలోకి అడుగుపెడతారు. అక్కడ వారిని డాక్టర్ వెన్నెల కిషోర్ (నారప్ప) పరిచయమవుతాడు. తర్వాత వాళ్ల దగ్గరి నుంచి రవి ప్రకాశ్ (రెడ్డప్ప) మనుషులు నగలను దొంగిలిస్తాడు. నగల కోసం పాడుబడ్డ బంగ్లాకి వెళ్తారు. ఆ తర్వాత వారంతా దెయ్యాలని తెలుసుకుని నగల కోసం ప్రయత్నం చేస్తారు.

తర్వాత సెకండాఫ్ లో నగలు సంపాదించాలని అసలు నగలు ఎక్కడివో తెలుసుకునేందుకు తాను దొంగతనం చేసిన ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీస్తాడు. పలు చోట్ల అన్ని విషయాలు తెలుకుంటాడు. ఆ నగలు రెడ్డప్ప కూతురు కాత్యాయని కోసం చేయించినట్టు తెలుసుకుంటాడు. తర్వాత రెడ్డప్ప కూతురు కాత్యాయని.. గీతనే అని నమ్మించి నగలను కొట్టేయాలని చూస్తాడు. కానీ ఆ క్రమంలో రెడ్డెప్పకు దొరికిపోతారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు, భూమి.. బసవను చంపాలనుకోవడం, వాటిన్నింటిని బసవ ఎలా ఎదుర్కొన్నాడో సెకండాఫ్ లో చూడొచ్చు.

కథనం- విశ్లేషణ:

సినిమాలో హీరోయిన్ భూమి ఊరి బాగుకోసం బసవ దొంగతనం చేస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ చివరిలో ఆ సిక్రెట్ బయటపెడతాడు. అలాగే కొన్ని హరర్ సన్నివేశాలు, వెన్నెల కిషోర్, వైవ హర్ష, బ్రహ్మాజీ మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే కథలో ప్రారంభం నుంచి విరామ సమయం వరకు పలు అంశాలపై ఆసక్తిని పెంచేలా కథ ఉంటుంది. దీంతో ఫస్ట్ హాఫ్ ఉన్న ట్విస్టులకు.. సెకండాఫ్ లో సమాధానం దొరుకుతుందని అంతా భావించారు. కానీ సెకండాఫ్ లో ఆ ట్విస్టులకు సమాధానం చూపకపోవడం. హరర్ సన్నివేశాలను చూపించినా.. అవి ప్రేక్షకులను భయపెట్టలేకపోయాయి. అలాగే ప్రేమ కోసమే కథ మొత్తం తిరిగినా.. అసలు ఆ లవ్ స్టోరీని సినిమాలో బలవంతంగా పెట్టినట్టు ఉంది. సెకండాఫ్ ని మాత్రం ఏదో సినిమాను పూర్తి చేయాలనేలాగా ముగించారు.

నటీనటులు:

సందీప్ కిషన్ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్లు వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ కూడా తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. అలాగే వెన్నెల కిషోర్, వైవ హర్ష, బ్రహ్మాజీ కూడా తమ నటనతో హాస్యాన్ని పండించారు. తమ పాత్రలకు ప్రాణం పోశారు. రవిప్రకాశ్, వడివుక్కరసి కూడా తమ నటనతో సినిమాకు జీవం పోశారు.

సాంకేతిక వర్గం:

ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ లో స్టోరీని డైరెక్టర్ ఆనంద్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులను తన కథతో కట్టిపడేశాడు. ఇక పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మరోవైపు శేఖర్ చంద్ర అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. అలాగే గ్రాఫిక్స్ కూడా సినిమాకు పర్వలేదనిపించారు. కానీ ఫస్ట్ హాఫ్ లో లేవనెత్తిన సందేహాలను తీర్చడంలో, కథను పరిపూర్ణం చేయడంలో డైరెక్టర్ ఆనంద్ విఫలమయ్యాడనే చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో నటీనటుల యాక్టింగ్

ఫస్ట్ హాఫ్ కామెడీ

ఫస్ట్ హాఫ్ లోని ట్విస్టులు, హరర్ సీన్స్

మైనస్ పాయింట్స్:

స్టోరీని పూర్తిగా తయారు చేసుకోకపోవడం

లవ్ స్టోరీని బలవంతంగా యాడ్ చేయడం

ఫస్ట్ హాఫ్ లోని ట్విస్టులకు సమాధానాలు లేకపోవడం

క్లైమాక్స్ లో సినిమాను మమా అనిపించడం

పంచ్ లైన్: ఏదో ఉందనుకున్న భైరవకోనలో ఏమీ లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button