తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పుట్టినరోజు (1944 ఫిబ్రవరి 15)

తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. ఈయన జనగామ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికకావడమే కాకుండా నలుగురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పీసీసీ తొలి అధ్యక్షులుగా నియమితులయ్యారు. అయితే 2023 లో జరిగిన ఎన్నికల్లో జనగామ నుంచి తనకు టికెట్ దక్కలేదనే మనస్థాపంతో అక్టోబర్ 13న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం అక్టోబర్ 16 న జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

Also Read: అమెరికాలో భారీగా మంచు తుపాను.. నిలిచిపోయిన జనజీవనం

విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాలను ప్రయోగించే విషయంలో 2017లో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏడు దేశాలకు చెందిన 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి కార్టోశాట్-2తో సహా 104 ఉపగ్రహాలను PSLV-C37 లో ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

హీరోయిన్ మీరా జాస్మిన్ పుట్టినరోజు

హీరోయిన్ మీరా జాస్మిన్ 1982, ఫిబ్రవరి 15న జన్మించారు. ఈమె తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాలలో కూడా పాత్రలను పోషించారు. ఈమె నటనకు గాను పాదమ్ ఒన్ను ఒరు విలాపం అనే మలయాళ సినిమాకు 2004లో జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు వంటి పలు చిత్రాలలో నటించింది.

Also Read: ఏపీలో గ్రూప్ 2 పరీక్షలు… హాల్ టికెట్లు విడుదల

ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జయంతి ( 1564 ఫిబ్రవరి 15- 1642 జనవరి 8)

దూరంలో ఉన్న వస్తువులను చూసేందుకు ఇటలీకి చెందిన శాస్త్రవేత్త గెలీలియో గెలీలి టెలిస్కోప్‌ను కనిపెట్టాడు. తొలుత 50 మైళ్ల దూరంలోని వస్తువులను చూసేందుకు వీలుపడింది. దీంతో ఏ వస్తువునైనా 8 రెట్లు పెద్దదిగా చూసే అవకాశం కలిగింది. దీని సాయంతోనే గెలిలియో అంతరిక్షంలో అనేక పరిశోధనలు చేసి ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. ఇటలీలోని పీసా ప్రాంతంలో 1564 ఫిబ్రవరి 15 న గెలీలీయో జన్మించారు.

మరికొన్ని విశేషాలు

  • 2003లో ఇరాక్ యుద్దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా 600 నగరాల్లో విస్తృత నిరసనలు జరిగాయి. 8.30 మిలియన్ల మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఇది చరిత్రలో అతిపెద్ద శాంతి ప్రదర్శనగా నిలిచింది.
  • 1978లో కొత్త ఆటగాడు లియోన్ స్పింక్స్ బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీని ఓడించి హెవీవెయిట్ టైటిల్ ను గెలుచుకున్నారు.
  • 1927లో క్లారా బో నటించిన మూకీ చిత్రం ఇట్ యూఎస్ లో విడుదలైంది.
  • 1950లో క్లాసిక్ డిస్నీ యానిమేషన్ చిత్రం సిండ్రెల్లా ప్రదర్శించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button