తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Eagle: రవితేజ పుట్టినరోజు నేడు… ఈగల్ మూవీ సాంగ్ రిలీజ్

మాస్ మహరాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మూడో సాంగ్‌ Eagle’s on the wayను కూడా లాంఛ్ చేశారు.

Also Read: టిల్లు స్క్వేర్ రిలీజ్ డేజ్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ టీం

ఈగల్‌ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు, స్టైలిష్ లుక్‌, ట్రైలర్‌ అప్‌డేట్ లుక్ సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. రవితేజ లాంగ్ హెయిర్‌, గడ్డంతో బ్లాక్ స్టైలిష్‌ గాగుల్స్ పెట్టుకొని.. ముందున్న టేబుల్‌పై మోడ్రన్ గన్స్ కనిపిస్తూ.. మరోవైపు మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు పిస్తోల్‌ పట్టుకుని ఉన్న కాన్సెప్ట్‌ పోస్టర్‌ తో ఈగల్‌ విధ్వంసం ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button